కర్నూల్‌లో కాల్‌మనీ కలకలం: వివాహిత ఆత్మహత్య

By narsimha lodeFirst Published Mar 11, 2020, 11:03 AM IST
Highlights

కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం బీరవల్లిలో కాల్‌మనీ కారణంగా  ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తీసుకొన్న అప్పు కంటే వడ్డీని కలిపి  ఎక్కువ వసూలు చేశారు


కర్నూల్:కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం బీరవల్లిలో కాల్‌మనీ కారణంగా  ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తీసుకొన్న అప్పు కంటే వడ్డీని కలిపి  ఎక్కువ వసూలు చేశారు. అంతేకాదు బాధితురాలని లైంగికంగా వేధింపులకు గురిచేశారు.దీంతో  మనోవేదనకు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

  రామాంజనమ్మ అనే మహిళకు పెద్ద మద్దయ్య కుటుంబం రూ. 2 లక్షలు అప్పు ఇచ్చింది. రెండేళ్ల వరకు ఆమె నుండి వడ్డీ కానీ, అసలుు కానీ వసూలు చేయలేదు. అయితే రెండేళ్ల తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ.. 11 లక్షలు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు.  

ప్రతి నెల వడ్డీ కోసం ఆమెను వేధించారు. అంతేకాదు బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలుపోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు కూడ స్పందించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిందని బాధితురాలిని బెదిరించారు.  ఈ  బెదిరింపులు తట్టుకోలేక ఆమె బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది.  

రామాంజనమ్మకు భర్త,  ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం పోలీసులను కోరుతోంది.కాల్ మనీ వేధింపుల కారనంగానే రామంజనమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని  కుటుంబసభ్యులు  చెబుతున్నారు.  

 

click me!