17రోజులు మద్యం దుకాణాలు బంద్.. ఇంకేమైనా ఉందా!

By telugu news teamFirst Published Mar 11, 2020, 10:09 AM IST
Highlights

 స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ నెల 12 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో మద్యం ప్రియులు ముందుగానే అలర్ట్ అయ్యారు. 


ఆంధ్రప్రదేశ్ లో త్వరలో స్థానిక ఎన్నికలు  జరగనున్నాయి. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీ నాయకులు ఎంత సిద్ధంగా ఉన్నారో తెలీదు కానీ.. మందు బాబులు మాత్రం చాలా అలర్ట్ గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అని.. అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు టెన్షన్ లో ఉంటే.. మద్యం ప్రియులు మాత్రం... ఈ ఎన్నికల వల్ల తమకు ఎక్కడ మద్యం దొరకదా అనే కంగారులో ఉన్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ నెల 12 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో మద్యం ప్రియులు ముందుగానే అలర్ట్ అయ్యారు. 

Also Read గ్రామ పంచాయితీలపై వైసీపీ రంగులు తొలగించాలి: ఏపీ హైకోర్టు

వచ్చే 17 రోజుల పాటు తమ మద్యం అవసరాలకు అనుగుణంగా ముందుగానే తమకు కావాల్సినంత మద్యం  కొనుగోలు  చేసుకోవడం గమనార్హం. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మద్యం దుకాణాల ముందు ప్రజలు బారులు తేరి కనిపించడం గమనార్హం.

ఒక్కొక్కరు మూడు సీసాలు, అంతకన్నా ఎక్కువగానే కొనుగోలు చేస్తుండటం విశేషం. ఎక్కడ మళ్లీ ఈ 17 రోజుల పాటు మద్యం దొరకదో అనే కంగారుపడి.. ముందు జాగ్రత్త పడ్డారు. 

అయితే.. మద్యం దుకాణాలు ఈ నెల 12 నుంచి మూసివేయాలంటూ ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై ఈ రోజు, రేపటిలో క్లారిటీ రానుంది. 

click me!