అన్నమయ్య జిల్లా దారుణం.. కోడలు తలనరికి చంపిన హత్య.. తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగుబాటు..

Published : Aug 11, 2022, 03:54 PM ISTUpdated : Aug 11, 2022, 04:09 PM IST
అన్నమయ్య జిల్లా దారుణం.. కోడలు తలనరికి చంపిన హత్య.. తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగుబాటు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారణం చోటుచేసుకుంది. అత్త తన కోడలిని దారుణంగా హత్య చేసి.. కోడలి తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారణం చోటుచేసుకుంది. అత్త తన కోడలిని దారుణంగా హత్య చేసి.. కోడలి తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. వివరాలు.. రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో సుబ్బమ్మ అనే మహిళ తన కోడలు వసుంధరను నరికి చంపింది. అనంతరం కోడలి తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుబ్బమ్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే సుబ్బమ్మ ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా  తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సుబ్బమ్మ ఇంటికి వెళ్లిన పోలీసులు.. వసుంధర మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్