కన్నతల్లినే కడతేర్చిందో కసాయి కూతురు. తన కొడుకును సరిగా చూసుకోవడం లేదని తల్లి మందలించడంతో కోపంలో కనిపెంచిన తల్లినే తుదముట్టించింది. ఈ దారుణమైన ఘటన గుంటూరులో జరిగింది.
కన్నతల్లినే కడతేర్చిందో కసాయి కూతురు. తన కొడుకును సరిగా చూసుకోవడం లేదని తల్లి మందలించడంతో కోపంలో కనిపెంచిన తల్లినే తుదముట్టించింది. ఈ దారుణమైన ఘటన గుంటూరులో జరిగింది.
గుంటూరు, నగరంపాలెం, ఏటీ అగ్రహారం జీరో లైనులో ఉండే పూతా బత్తిని భూలక్ష్మి(58) కి కొడుకు నాగరాజు, కూతురు దాసరి అలియాస్ భవనం రమాదేవి ఉన్నారు. ఆరేళ్ల కుమారుడు రాహుల్ రెడ్డితో కలిసి రమాదేవి తల్లి దగ్గరే ఉంటోంది.
అయితే రమాదేవి కొంతకాలంగా వ్యసనాలకు బానిసగా మారింది. కొడుకును పట్టించుకోవడం మానేసి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో 25వ తేదీ రమాదేవి బైటికి వెళ్లడంతో కొడుకు రాహుల్ భోజనం చేయకుండా ఏడుపు మొదలుపెట్టారు. ఎంత సముదాయించినా వినడం లేదు.
దీంతో తల్లి భూలక్ష్మి కుమార్తెకు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. ఇంటికొచ్చిన తర్వాత తల్లీకూతుర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ కోపంలో రమాదేవి తల్లి భూలక్ష్మి గొంతు నులుముతుంటే తమ్ముడైన నాగరాజు అడ్డుపడి తల్లిని వదిలించాడు.
ఆ తరువాత నాగరాజు తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ భూలక్ష్మి మృతి చెందింది. దీనిమీద పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.