చిత్తూరులో ‘‘జై భీమ్’’ తరహా ఘటన.. దొంగతనం నేరం మోపి చిత్రహింసలు, నడవలేని స్థితిలో బాధితురాలు

Siva Kodati |  
Published : Jan 23, 2022, 10:00 PM IST
చిత్తూరులో ‘‘జై భీమ్’’ తరహా ఘటన.. దొంగతనం నేరం మోపి చిత్రహింసలు, నడవలేని స్థితిలో బాధితురాలు

సారాంశం

చిత్తూరు జిల్లాలో (chittoor district) సూర్య నటించిన‘‘ జై భీమ్‌’’ (jai bhim movie) సినిమాలో తరహా ఘటన జరిగింది. చేయని తప్పుకు పోలీసులు తనను చిత్ర హింసలు పెట్టారని ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. వేణుగోపాల్‌ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాధితురాలిపై ఆయన కుటుంబ సభ్యులు దొంగతనం నేరం మోపారు. ఈ నెల 18న వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో 2 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. 

చిత్తూరు జిల్లాలో (chittoor district) సూర్య నటించిన‘‘ జై భీమ్‌’’ (jai bhim movie) సినిమాలో తరహా ఘటన జరిగింది. చేయని తప్పుకు పోలీసులు తనను చిత్ర హింసలు పెట్టారని ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా జైలు సూపరిండెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాధితురాలిపై ఆయన కుటుంబ సభ్యులు దొంగతనం నేరం మోపారు. ఈ నెల 18న వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో 2 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. ఈ డబ్బును బాధితురాలే దొంగతనం చేసిందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు విచారణకు పిలిచారు. అయితే విచారణ పేరుతో తనను పోలీసులు చిత్రహింసలు పెట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. చివరకు నేరం రుజువు కాకపోవడంతో తనను విడిచిపెట్టారని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం తాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. సూర్య నటించిన `జైభీమ్‌` సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఓ పేద కుటుంబంపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, వాళ్లని ఎలా బలిపశువులను చేస్తున్నారనే విషయాన్ని, అదే సమయంలో న్యాయంకోసం ఓ పేద మహిళ చేసిన పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. అరుదైన రికార్డు లు క్రియేట్‌ చేసింది. ఓటీటీలో విడుదలై కూడా ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కడం, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం విశేషం. 

మాజీ జస్టిస్‌ కె. చంద్రు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. సూర్య హీరోగా నటించారు.  భారతదేశంలోని సామాజిక అసమానతలు - కుల వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. గిరిజనులు అణగారిన వర్గాలు - ఆదివాసీ తెగలకు చెందిన అమాయకపు ప్రజలపై అన్యాయంగా కొందరు పోలీసులు చేసే దుశ్చర్యలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన 'జై భీమ్' చిత్రం గురించి ఇటీవల ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ లో కొనియాడారు. అలానే సినిమా రేటింగ్ సంస్థ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

తాజాగా 'జై భీమ్' సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2022 కు ఎంపికైంది.  ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ కష్టానికి గుర్తింపు దక్కుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. తాము గర్వంగా ఫీలవుతున్నామని వెల్లడించింది. ఈ చిత్రంలో సూర్యతోపాటు మణికందన్,  లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించారు.  ప్రకాష్ రాజ్, రజిషా విజయన్ కీలక పాత్రల్లో మెరిశారు. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu