ప్రభుత్వ ఉద్యోగం పేరిట ఘరానా మోసం... గుంటూరులో తల్లీ కొడుకుల ఆత్మహత్యాయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Apr 28, 2022, 11:05 AM IST
ప్రభుత్వ ఉద్యోగం పేరిట ఘరానా మోసం... గుంటూరులో తల్లీ కొడుకుల ఆత్మహత్యాయత్నం

సారాంశం

కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మి భారీగా డబ్బులు చెల్లించి మోసపోయిందో తల్లి. దీంతో కొడుకుతో కలిసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

మంగళగిరి: కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ అమాయక మహిళ మోసం చేసాడో దుర్మార్గుడు. కొడుకు జీవితం బాగుపడుతుందని భావించి నివాసముంటున్న ఇంటిని తనఖా పెట్టి రూ.25లక్షలు తీసుకుని ఇచ్చి మోసపోయింది. ఇప్పుడు అటు కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం రాక, ఇటు నివాసముంటున్న ఇళ్లు విడిచిపెట్టాల్నిన పరిస్థితి రావడంతో తీవ్ర మనోవేదనకు గురయిన మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. తల్లీ కొడుకు ఇద్దరూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో నందం రామకుమారి కొడుకు మణికంఠతో కలిసి జీవిస్తోంది. కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయి ఆమె గ్రామంలోనే రేషన్ దుకాణంతో పాటు టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది.  

ఎంబిఏ చదివిన మణికంఠ కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం చేసేవాడు.  అయితే ఒక్కగానొక్క కొడుకు దూరంగా వుండటంతో రామకకుమారి ఒంటిరిగా వుండలేకపోయింది. దీంతో కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం వుంటే తనవద్దే వుంటాడని భావించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

ఎంత ఖర్చయినా పర్వాలేదు... కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం వస్తేచాలని రామకుమారి భావించేది. ఈ క్రమంలోనే తనవద్దకు వచ్చేవారిని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సాధించవచ్చో ఆరా తీసేది. ప్రభుత్వంలో తెలిసిన వారు ఎవరైనా వుంటే చూడాలంటూ కోరేది. ఇలా ఓసారి రామకుమారి హోటల్ కు ఎర్రబాలెంకు చెందిన సంజీవ్ కుమార్ రాగా అతడిని కూడా ప్రభుత్వ ఉద్యోగం గురించి అడిగింది. దీంతో ఆమెను మోసగించి భారీగా డబ్బులు లాగాలని అతడు భావించాడు. 

తాను జర్నలిస్టునని... ముుఖ్యమంత్రి కార్యాలయంలో తనకు తెలిసినవారు వున్నారంటూ రామకుమారిని సంజీవ్ నమ్మించాడు. తనకు తెలిసిన ద్వారా కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం రూ.25లక్షలు డిమాండ్ చేయగా ఇంటిని తనఖా పెట్టిమరీ చెల్లించింది. కొడుకుతో కూడా బెంగళూరులో ఉద్యోగం మాన్పించి ఇంటికి పిలిపించుకుంది.  

ఇలా కొడుకుకు ఉద్యోగం ఇప్పిస్తానని సంజీవ్ కు డబ్బులిచ్చి మూడేళ్లు గడుస్తోంది. అటు కొడుకుకు ఉద్యోగం రాలేదు... ఇటు తనఖా పెట్టిన ఇళ్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీంతో రామకుమారికి అనుమానం వచ్చం సంజీవ్ కుమార్ ను నిలదీసింది.పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా తాను డబ్బులు తీసుకున్న మాట నిజమేనని... ఆ డబ్బులు తిరిగి ఇస్తానని సంజీవ్ ఒప్పుకున్నాడు. కానీ ఇంతవరకు డబ్బులు తిరిగివ్వకపోగా తల్లీ కొడుకునే చంపేస్తానని బెదిరించసాగాడు.  

దీంతో బాధితురాలు రామకుమారి తనకు జరిగిన మోసంపై గత రెండు రోజుల క్రితం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో ఏమయ్యిందో తెలీదుగానీ బుధవారం. మధ్యాహ్నం రామకుమారి, ఆమె కుమారుడు మణికంఠ లు తమ ఇంటిలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురయి మంచంపై అపస్మారక స్థితిలో పడివున్న తల్లీకొడుకును గమనించిన స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. 

ప్రస్తుతం చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో తల్లీ కొడుకు చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స అందించి రామకుమారి, మణికంఠను  కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్