కర్నూలు జిల్లాలో దారుణం: పురుగుల మందు తాగించి, కొడుకు గొంతు కోసిన తల్లి

Published : Apr 28, 2021, 01:13 PM ISTUpdated : Apr 28, 2021, 01:47 PM IST
కర్నూలు జిల్లాలో దారుణం: పురుగుల మందు తాగించి, కొడుకు గొంతు కోసిన తల్లి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ తల్లి తన కడుపున పుట్టిన ఏడాది వయస్సు గల కుమారుడిని హత్య చేసింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

కర్నూలు: కర్నూలు జిల్లా రుద్రవరంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లే కర్కషంగా మారి ఏడాది కుమారుడిని హత్య చేసింది. పురుగుల మందు తాగించి, గొంతు కోసం కుమారుడిని తల్లి హత్య చేసింది. ఏడాది వయస్సు గల బాలుడు అక్కడికక్కడే మరణించాడు.

కుమారుడిని చంపిన తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ కలహాలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లిదండ్రులు  బలవన్మరణానికి పాల్పడ్డారు. 

నంద్యాలలోని మాల్దారుపేటలో ఆ సంఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 

మృతి చెందినవారిని శేఖర్ (35), కళావతి (300, అంజలి (16), అఖిల (14)లుగా పోలీసులు గుర్తించారు. పురుగుల మందు తాగి నలుగురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu