టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి: చంద్రబాబు

By narsimha lodeFirst Published Apr 28, 2021, 12:44 PM IST
Highlights

టెన్త్,ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. విద్యార్ధుల ప్రాణాలతో  చెలగాటమాడవద్దని  ఆయన కోరారు.


అమరావతి: టెన్త్,ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. విద్యార్ధుల ప్రాణాలతో  చెలగాటమాడవద్దని  ఆయన కోరారు.బుధవారం నాడు  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  మీడియాతో మాట్లాడారు. 
రాష్ట్రంలో  కరోనాతో పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్న సమయంలో  ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎంతమందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారో చెప్పాలని ఆయన కోరారు. మూడు గంటల్లో ఎంతమంది రోగులకు బెడ్స్ అందించారనిఆయన ప్రశ్నించారు. 

also read:టెన్త్ పరీక్షలపై వెనక్కి తగ్గని వైఎస్ జగన్: భవిష్యత్తుకు నష్టమని వాదన...

ఏపీ నుండి పక్క రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ పాస్ తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 25.8 శాతంగా ఉన్నాయన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే ముందే రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచారన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ చేర్చామని చెప్పడం అబద్దమన్నారు. 10 లక్షల మందికి పరీక్షలు చేస్తే 20 వేల మందికి కరోనా సోకుతుందన్నారు.

అందరినీ కలుపుకుని పోయి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులకు కూడ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని ఆయన మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేవారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బాబు విమర్శించారు. కరోనాపై ప్రభుత్వం ఇస్తున్న జీవోలు అమలు కావడం లేదన్నారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీలో ప్రతి రోజూ 12 వేల కరోనా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. సెకండ్ వేవ్‌పై ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. 
 

click me!