విజయవాడలో ఓ మహిళ దారుణానికి తెగబడింది. నడిరోడ్డులో పట్టపగలు.. ఓ ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదింది. నడుస్తున్న బస్సును ఆపి, క్యాబిన్ మీదికి ఎక్కి.. డ్రైవర్ ను కాలితో తన్ని.. చెంప పగలగొట్టి, చొక్కా చింపి...వీరంగం సృష్టించింది...
సూర్యరావుపేట : తన ద్విచక్రవాహనంపైకి RTC bus దూసుకొచ్చిందన్న ఆగ్రహంతో vijayawada నగరం గవర్నర్పేట ప్రకాశం రోడ్డులో బుధవారం ఓ woman వీరంగం సృష్టించింది. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల వివరాల ప్రకారం.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్. విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం బస్సు తీసుకుని ప్రకాశం రోడ్డులో వెళుతుండగా.. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆంధ్రా హాస్పిటల్ ఎదురుగా నందిని అనే మహిళ two wheelarపై వెళుతూ బస్సుకు అడ్డొచ్చింది.
ముసలయ్య బ్రేక్ వేయగా బస్సు మహిళ సమీపంలోకి వెళ్ళి ఆగింది. ఈ ఆకస్మిక పరిణామంతో... సదరు మహిళ ఆగ్రహంతో తిట్టుకుంటూ బస్సు లోకి ప్రవేశించి డ్రైవర్ పై దాడి చేసింది. డ్రైవర్ ను కొట్టి, చొక్కా చింపి, కాలితో తన్నింది. బస్సులో ఉన్నవారు వారిస్తున్నా వినలేదు. చివరికి ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఆపడానికి ప్రయత్నించినా... అతని ముందే డ్రైవర్ ను గల్లా పట్టి మరీ కొట్టింది.
undefined
విషయం తెలుసుకొని పోలీసులు వచ్చి ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన మహిళ కృష్ణలంక తారకరామా నగర్ కు చెందిన కుంభా నందిని గుర్తించారు
ఇదిలా ఉండగా, విజయవాడలో నిరుడు మే 10న ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విజయవాడ ఎంజీ రోడ్డులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. రాఘవయ్య పార్క్ దగ్గర కారులో వచ్చిన యువకుడు ఓ ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. యూ టర్న్ విషయంలో గొడవ పడి, ఆటో డ్రైవర్ పై యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై చిందులు వేశాడు. ట్రాఫిక్ పోలీసులపైన, పాదచారులు పైన దురుసుగా వ్యవహరించాడు. అయితే, ఇంతకీ అతని కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. అతను బందరు రోడ్డులో స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో బ్లూ కోల్ట్స్ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. యువకుడి దాడిలో ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని ఘటన జరిగిన సమయంలో అక్కడున్న పాదచారులు, వాహన చోదకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా,ఆగస్ట్ 25, 2020లో...అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వనందుకు ఓ యువతి వాచ్‌మెన్‌ను చితక్కొట్టింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ చందానగర్‌లోని సిరి అపార్ట్‌మెంట్‌కు ఓ మహిళ కారులో వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అనుమతి లేకుండా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లకూడదంటూ వాచ్‌మేన్ ఆమెను అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ కారు దిగి వచ్చి మరి వాచ్‌మేన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది.
నన్నే ఆపుతావా అంటూ పిడిగుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. అక్కడితో ఆగకుండా చెప్పు తీసి ఇష్టమొచ్చినట్లు కొట్టింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.