వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి భర్తను చంపి, పాము కాటుతో చనిపోయాడని కలరింగ్.. అరెస్ట్...

Published : Feb 01, 2022, 10:19 AM IST
వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి భర్తను చంపి, పాము కాటుతో చనిపోయాడని కలరింగ్.. అరెస్ట్...

సారాంశం

తరచూ ప్రియుడిని కలుసుకునేందుకు భర్త రవీంద్ర అడ్డు వస్తుండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించారు. పథకం ప్రకారం ఈ నెల 3న అర్ధరాత్రి తలదిండుతో రవీంద్రకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత పాము కాటుతో మృతి చెందినట్లుగా నమ్మించారు. అయితే రవీంద్ర ఊపిరి అందకపోవడంతో చనిపోయాడని, శరీరంపై గాయాలు ఉన్నట్లు పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేసింది.

అంతపురం :  ప్రియుడి మోజులో husbandను హతమార్చిన వైనం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.  ఘటనకు సంబంధించి ప్రియుడితో పాటు  మహిళనూ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు..  ఆలమూరు గ్రామానికి చెందిన చియ్యేడు రవీంద్ర (40), బోయ విజయలక్ష్మి దంపతులు. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కొంత కాలంగా తమ సమీప బంధువు  చియ్యేడు  సందీప్ తో  విజయలక్ష్మి extra marital affair కొనసాగిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో తరచూ కలుసుకునేందుకు భర్త రవీంద్ర అడ్డు వస్తుండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించారు. పథకం ప్రకారం ఈ నెల 3న అర్ధరాత్రి తలదిండుతో ravindraకు ఊపిరాడకుండా చేసి murder చేశారు. ఆ తర్వాత snake byteతో మృతి చెందినట్లుగా నమ్మించారు. అయితే రవీంద్ర ఊపిరి అందకపోవడంతో చనిపోయాడని, శరీరంపై గాయాలు ఉన్నట్లు పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం వెలుగు చూసింది. విజయలక్ష్మి, సందీప్ ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆదివారం రిమాండ్కు తరలించారు. 

ఇదిలా ఉండగా, తన మెడలో తాళి కట్టి మరో మహిళతో extramarital affair ఏర్పరచుకున్న భర్తను.. భార్య supari gangతో murder చేయించిన ఉదంతమిది. నిర్మల్ డిఎస్పి ఉపేందర్రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుచానూరు ప్రాంతానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ (42) అనాధ. ఉపాధి కోసం hyderabad కు వచ్చాడు. తొలుత auto నడిపేవాడు. ఆ క్రమంలో ఉప్పల్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది.  

ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకుని.. వివాహం చేసుకున్నారు. స్వప్నకు ఇదివరకే వివాహమై ఒక కుమారుడు (రాజకుమార్) జన్మించాక.. విడాకులు తీసుకుంది. శ్రీనివాస్, స్వప్న దంపతులకు వివాహం తరువాత ఒక కుమారుడు (తరుణ్),  కుమార్తె జన్మించారు. ఆ తరువాత స్నేహితుల సాయంతో real estate వ్యాపారంలోకి శ్రీనివాస్ అడుగుపెట్టాడు.

ఉప్పల్,  వేంపేట్ లలో ఇల్లు నిర్మించాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆమెతోపాటు కలిసి ఉందాం అంటూ తరచూ భార్యను వేధించసాగాడు.  ఆ వేధింపులు భరించలేక అతన్ని చంపేస్తే సమస్య పరిష్కారం అవుతుందని స్వప్న భావించింది. ఇటీవల కుటుంబ సభ్యులు వేంపేటకు వచ్చారు.  ఇదే అదనుగా భావించిన స్వప్న  తరుణ్, రాజ్ కుమార్ లతో పాటు  నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన తన అక్క కుమారుడు  పోశెట్టిలతో కలిసి శ్రీనివాస్ ను చంపాలనుకున్నట్లు చెప్పింది. 

సుపారీ గ్యాంగ్ తో చేయిద్దామని పోశెట్టి తన తమ్ముడు చిక్కా అలియాస్ ప్రవీణ్ కుమార్ ను వేంపేటకు పిలిపించాడు. ఈ నెల 22న రాత్రి మెదక్, జగిత్యాల జిల్లాలకు చెందిన బాణాల అనిల్,  కంచర్ల మహావీర్, మ్యాతరి మధు, కొలనూరు సునీల్, పొన్నం శ్రీకాంత్,  పూసల రాజేందర్ లతో 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోతున్న శ్రీనివాస్ ను రోకలిబండతో దాడి చేసి హత్య చేశారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu