సిబిఐ ఆఫీసులో ఉద్యోగం పేరుతో ప్రియుడితో సహవాసం.. భర్తకు ఉరివేసి చంపి.. అదృశ్యమయ్యాడని..

Published : Jan 13, 2023, 08:21 AM ISTUpdated : Jan 13, 2023, 12:14 PM IST
సిబిఐ ఆఫీసులో ఉద్యోగం పేరుతో ప్రియుడితో సహవాసం.. భర్తకు ఉరివేసి చంపి.. అదృశ్యమయ్యాడని..

సారాంశం

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు కిరాతకంగా హతమార్చిందో భార్య.. ఆ తరువాత అతను కనిపించడం లేదంటూ నాటకానికి తెరతీసింది. కానీ.. 

విశాఖపట్నం : వివాహేతర సంబంధాల నేపథ్యంలో భర్తలను హతమార్చే భార్యలు.. భార్యలను అడ్డు తొలగించుకునే భర్తలు పెరిగిపోతున్నారు. ఇలాంటి సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయని తెలిసినా క్షణికావేశంలో వాటిలో కూరుకుపోయి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అలాగే చేసిందో ఇల్లాలు. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. ఆ తర్వాత అతడు కనిపించడంలేదంటూ.. అందరిని నమ్మించాలని చూసింది. అడ్డంగా దొరికిపోయింది. విశాఖపట్నంలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

విశాఖపట్నం ఎంపీపీ కాలనీ సమీపంలోని వాసవానిపాలేనికి చెందిన జ్యోతి(25)కి ఆరేళ్ల కిందట.. భీమిలి మండలం వలందపేటకు చెందిన వంకా పైడిరాజు(28)తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఐదేళ్ల బాలాజీ, మూడేళ్ల హర్షితలతో వీళ్లది ముద్దులొలికే కుటుంబం. కుటుంబ పోషణ కోసం పైడిరాజు టైల్స్ పనులు చేసేవాడు. అయితే,  జ్యోతికి వీరిద్దరికి వివాహం అయ్యే కంటే ముందే వాసవానిపాలేంలో వారి పొరుగు ఇంట్లో ఉండే వాడమొదలు నూకరాజు(25)తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 

రోజా రెండుసార్లు గెలిచింది, పైగా మంత్రి.. నువ్వేం పొడిచావ్ : పవన్‌కు పేర్నినాని చురకలు

పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య కాస్త దూరం వచ్చినా.. ఇటీవల కాలంలో మళ్ళీ వారి మధ్య పరిచయం పెరిగింది. ప్రేమాయణం మొదలయ్యింది. జ్యోతి అత్త గారిది ఉమ్మడి కుటుంబం. దీంతో ఇక్కడ కలుసుకుంటే అందరికీ తెలిసిపోతుందని, కుదరదని వారిద్దరూ విశాలాక్షినగర్ లో ఓ గది అద్దెకు తీసుకున్నారు. ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం కోసం ఒక కొత్త కథ అల్లింది  జ్యోతి. సిబిఐ ఆఫీసులో హౌస్ కీపింగ్ లో పని దొరికిందని ఇంట్లో వాళ్ళను నమ్మించింది. ఆరు నెలలుగా ఈ వంకతో ప్రతిరోజు ఉదయం ప్రియుడి గదికి వెళ్ళేది. తిరిగి రాత్రి ఉద్యోగం నుంచి వచ్చినట్టుగా ఇంటికి వచ్చేది. 

ఈ క్రమంలో ప్రియుడిపై మోజు ఎక్కువ కావడం… ఈ విషయం బయటపడితే,  తమ సంబంధం ముందుకు సాగదని అనుకున్నారో ఏమో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. అలా డిసెంబర్ 29వ తేదీ రాత్రి భర్త పైడిరాజు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. ఆ తర్వాత అర్థరాత్రి ఒంటిగంటకు ప్రియుడు నూకరాజుకి ఫోన్ చేయగా అతను తన సోదరుడి వరస అయ్యే కె. భూలోకతో కలిసి వచ్చాడు. అప్పటికే నిద్ర మాత్రల ప్రభావంతో గాడ నిద్రలో ఉన్న పైడిరాజు మేడకు తీగ బిగించారు. అలా హతమార్చారు. ఆ తర్వాత పైడిరాజు మృతదేహాన్ని నూకరాజు తీసుకువచ్చిన టూ వీలర్ మీద మధ్యలో పెట్టుకుని.. విశాలాక్షి లాగర్ లోని తమ అద్దె గదికి తరలించారు.

ఇక ఆ తర్వాత తెల్లవారుజామున నూకరాజు ఓ అంబులెన్స్ కు కాల్ చేశాడు.  తన స్నేహితుడికి హఠాత్తుగా ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి  తీసుకెళ్లాలని తెలిపాడు. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది పైడిరాజును పరీక్షించి.. అతను చనిపోయాడని చెప్పారు. ఈ క్రమంలో నూకరాజు..   బాధ పడుతున్నట్టు నాటకం ఆడుతూ అతనికి ఎవరూ లేరని చెప్పి.. అంబులెన్స్ సిబ్బందిని నమ్మించాడు. అదే వాహనంలో  పైడిరాజు మృతదేహాన్ని పెద్ద జాలరిపేట సమీపంలోని వాసవానిపాలెం స్మశాన వాటికకు తరలించారు. 

అక్కడ అనాధ శవంగా గప్చుప్ గా దహనం చేశారు. ఆ బూడిదని సముద్రంలో కలిపేసి ఇంటికి వచ్చేశాడు. ఇదంతా అయిన తర్వాత జ్యోతి నింపాదిగా డిసెంబర్ 30న తన భర్త కనిపించడం లేదని బీమ్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే మృతుడి సోదరుడు జ్యోతి ప్రవర్తన పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆరాతీయగా ఆమె సిబిఐ ఆఫీసులో పనిచేయడం లేదని తేలింది. దీంతో పోలీసులకు కూడా ఆమె మీద అనుమానం బలపడింది.

ఆ కోణంలో దర్యాప్తు జరపగా..  ఆమె ఫోన్ కాల్స్ ఆధారంగా నూకరాజుతో వివాహేతర సంబంధం బయటపడింది. వెంటనే నిందితుల ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పైడిరాజును హత్య చేసినట్లు ఈ విచారణలో నిందితులు అంగీకరించారు. కట్టుకున్న భర్తనే అతి క్రూరంగా  హతమార్చిన జ్యోతి ఉదంతం తెలుసుకున్న వలందపేట గ్రామంలో కలకలం రేగింది.  గురువారం గ్రామస్తులు  భారీ సంఖ్యలో ర్యాలీగా భీమిలి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ముకుమ్మడిగా డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్