వివాహేతర సంబంధం: శ్రీసత్యసాయి జిల్లాలో భర్త, ప్రియురాలికి అరగుండు...ఊరేగింపు

Published : Sep 04, 2023, 05:02 PM ISTUpdated : Sep 04, 2023, 05:25 PM IST
వివాహేతర సంబంధం: శ్రీసత్యసాయి జిల్లాలో  భర్త, ప్రియురాలికి  అరగుండు...ఊరేగింపు

సారాంశం

శ్రీ సత్యసాయి జిల్లాలో  వివాహేతర సంబంధం పెట్టుకున్న   భర్త పట్టుకుంది భార్య, భర్త, అతని ప్రియురాలికి అరగుండు కొట్టించింది భార్య.   .   

అనంతపురం: శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలో సోమవారంనాడు దారుణం చోటు చేసుకుంది.  లేపాక్షి మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.ఈ విషయమై భర్తను పలుమార్లు భార్య నిలదీసింది. అయినా కూడ అతనిలో మార్పు రాలేదు.  ఇవాళ  లేపాక్షి మండలంలోని  తిలక్ నగర్ లో  మరో మహిళతో  ఉన్న హుస్సేన్ ను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.  భర్తకు, అతని ప్రియురాలికి  భార్య  అరగుండు  కొట్టించింది. ఇద్దరికి చేతులు కట్టేసింది.  గ్రామంలో ఊరేగించారు.

జిల్లాలోని లేపాక్షి మండలం ఇందిరమ్మ కాలనీలో  ఓ జంట ఉన్న విషయాన్ని గుర్తించి  మహిళ  పేరేంట్స్ ఈ జంటను  పట్టుకుని చితకబాదారు.  వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న  జంటకు  అరగుండు గీశారు.  ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై  విచారణ చేపట్టారు. 

 వివాహేతర సంబంధాలు  పచ్చని కాపురాల్లో చిచ్చును రేపుతున్న ఘటనలు  దేశ వ్యాప్తంగా అనేకం చోటు చేసుకుంటున్నాయి.జనగామ జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని  దారుణంగా హత్య చేశాడు. స్టేషన్ ఘన్ పూర్  మండలం శివునిపల్లికి చెందిన తీగల కరుణాకర్  హైద్రాబాద్  లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.  ఇదే గ్రామానికి చెందిన  నాగరాజు  హమాలీ పనిచేస్తున్నాడు.  నాగరాజు, కరుణాకర్ భూములు పక్కనే ఉన్నాయి.నాగరాజు భార్యకు  కరుణాకర్ ఫోన్ చేశాడు. ఈ విషయం  నాగరాజు కనిపెట్టాడు. కరుణాకర్ తో తన భార్య ఏకాంతంగా ఉన్న సమయంలోనే  కరుణాకర్ పై నాగరాజు దాడి చేశాడు. ఈ ఘటన  ఈ ఏడాది ఆగస్టు 30న చోటు చేసుకుంది. 

ఈ ఏడాది ఆగస్టు  29న   వివాహేతర సంబంధం  మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. తమిళనాడులోని  నమక్కల్ జిల్లాలో ప్రేమ అనే వివాహిత  తన భర్త హత్యలో కీలకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా  పోలీసులు తేల్చింది.  ధర్మపురి జిల్లాలోని నాట్రంపల్లికి చెందిన  నందికేశవన్ తో  ప్రేమకు వివాహేతర సంబంధం ఉంది.  తమ బంధానికి అడ్డుగా ఉన్న  భర్తను  హత్య చేసి  రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా  చిత్రీకరించింది. పోలీసుల విచారణలో ప్రేమ అడ్డంగా దొరికిపోయింది. 

also read:భార్యను రాళ్లతో కొట్టి హతమార్చిన భర్త.. దారుణానికి సహకరించిన సోదరులు.. కారణమదేనా..?

ఏలూరులో వివాహేతర సంబంధం నేపథ్యంలో సుజాత అనే మహిళను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు సత్యనారాయణ అనే నిందితుడు.ఈ ఘటన  ఈ ఏడాది  ఆగస్టు  28న చోటు చేసుకుంది.  తనను దూరం పెడుతుందని  సుజాతను పిలిపించి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత  తాను ఆత్మహత్య చేసుకున్నాడు నిందితుడు.
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu