అనారోగ్యంతో భర్త మృతి... అర్థరాత్రి చీకట్లో శవంతో..

Published : May 05, 2021, 07:39 AM IST
అనారోగ్యంతో భర్త మృతి... అర్థరాత్రి చీకట్లో శవంతో..

సారాంశం

కొంత కాలం క్రితం ప్రదీప్ కుమార్ అనారోగ్యానికి గురికాగా.. అంజలి తన భర్తను ఒడిశాలోని భువనేశ్వర్ ఆస్పత్రికి తీసుకువెళుతోంది. ట్యాక్సీ మాట్లాడుకొని అందులో తీసుకొని వెళుతోంది.

సమాజంలో రోజు రోజుకీ మానవత్వం పూర్తిగా తగ్గిపోతోంది. ఆపదలో ఉన్నవారికి కనీసం సహాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా.. ఓ మహిళ తన భర్తను కోల్పోగా.. ఆమె చిమ్మచీకట్లో ఆ శవంతోనే అర్థరాత్రి వేళ ఒక్కతో ఎదురు చూడటం గమనార్హం. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశా రాష్ట్రం బాలాసోర్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి అంజలి అనే యువతితో వివాహమైంది. వీరు హైదరాబాద్ లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంత కాలం క్రితం ప్రదీప్ కుమార్ అనారోగ్యానికి గురికాగా.. అంజలి తన భర్తను ఒడిశాలోని భువనేశ్వర్ ఆస్పత్రికి తీసుకువెళుతోంది. ట్యాక్సీ మాట్లాడుకొని అందులో తీసుకొని వెళుతోంది.

ట్యాక్సీలో వెళుతుండగా.. టెక్కలి సమీపానికి చేరుకునే సమయానికి ట్యాక్సీలోని ప్రదీప్ కుమార్ మృతి చెందారు. ట్యాక్సీ డ్రైవర్ అక్కవరం సమీపంలో రహదారి పక్కన మృతదేహాన్ని, ఆమెను దించేసి వెళ్లిపోయాడు. దీంతో అర్థరాత్రి సమయంలో కొంచెం కూడా కనికరం లేకుండా ఆమెను అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో సహాయం చేసేవారు లేక అంజలి.. భర్త శవంతో చిమ్మచీకట్లో కూర్చుండిపోయింది.  ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానిక ఎస్సై ఆమెను సొంతూరు పంపించే ఏర్పాట్లు చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu