ఏపీలో కరోనా కల్లోలం: 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు.. శ్రీకాకుళంలో అత్యధికం

Siva Kodati |  
Published : May 04, 2021, 07:58 PM IST
ఏపీలో కరోనా కల్లోలం: 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు.. శ్రీకాకుళంలో అత్యధికం

సారాంశం

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,034 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 11,84,028కి చేరింది

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,034 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 11,84,028కి చేరింది.

కరోనా వల్ల నిన్న ఒక్కరోజు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ వల్ల రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 8,289 కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వల్ల పశ్చిమ గోదావరి 12, అనంతపురం 9, తూర్పుగోదావరి 9, విశాఖపట్నం 9, విజయనగరం 9, నెల్లూరు 7, కృష్ణ 6, గుంటూరు 5, చిత్తూరు 4, కర్నూలు 4, ప్రకాశం 4, శ్రీకాకుళంలలో నలుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కోవిడ్ నుంచి 12,207 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో డిశ్చార్జ్‌ల సంఖ్య 10,16,142కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 1,59,597 మంది చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో 1,15,784 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా నిర్థారణా పరీక్షల సంఖ్య 1,68,33,932కి చేరింది. నిన్న ఒక్కరోజు అనంతపురం 2168, చిత్తూరు 2318, తూర్పుగోదావరి 1075, గుంటూరు 1678, కడప 793, కృష్ణ 998, కర్నూలు 1396, నెల్లూరు 1160, ప్రకాశం 1741, శ్రీకాకుళం 2398, విశాఖపట్నం 1976, విజయనగరం 1075, పశ్చిమ గోదావరిలలో 1258 మంది చొప్పున కోవిడ్ బారినపడ్డారు. 
 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu