త్వరలో కేసుల నుండి జగన్ కు విముక్తి ?

First Published Aug 12, 2017, 12:02 PM IST
Highlights
  • అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల కేటాయింపులో అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ పైన ఉన్న కేసును కూడా కోర్టు శుక్రవారం కొట్టేసింది.
  • ఆయనపై వేసిన ఛార్జిషీట్ నే హైకోర్టు కొట్టేయటం గమనార్హం.
  • జగన్ అక్రమాస్తుల కేసుల్లో మంత్రులకు సంబంధం లేదు.
  • ఐఏఎస్ అధికారుల పాత్రా లేక, పారిశ్రామికవేత్తలకు-జగన్ కు మధ్య క్విడ్ ప్రోకో జరిగినట్లు ఆధారాలు లేకపోతే ఇక జగన్ అవినీతికి ఏవిధంగా పాల్పడ్డారన్నది పెద్ద ప్రశ్న.

అక్రమాస్తుల కేసుల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తొందరలో విముక్తి లభించేట్లే కనబడుతోంది. జగన్ కేసుల్లో చాలామందిపై సిబిఐ కేసులు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి వారిలో పలువురు జైలుకు కూడా వెళ్లారు. తర్వాత బైలూ తెచ్చుకున్నారనుకోండి అదివేరే సంగతి. సిబిఐ కేసులు నమోదైన వారిలో పారిశ్రామికవేత్తలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులున్నారు. అయితే, కేసుల్లో మంత్రులను విచారించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుమతించలేదు.

అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలు అరెస్టైనా సరైన ఆధారాలు లేవంటూ కొన్ని కేసులను కోర్టు కొట్టేసింది. అదే సమయంలో ఐఏఎస్ అధికారులకు కూడా ఊరట లభించింది. ఐఏఎస్ అధికారులకు ఎవరికీ ఏ కేసులోనూ వ్యక్తగత లబ్ది జరగలేదని, మంత్రివర్గం ఆదేశాలను మాత్రమే పాటించారంటూ కోర్టు కేసులను కొట్టేసింది. తాజాగా శాంబాబ్ మీదున్న కేసులను కూడా కోర్టు కొట్టేయటం గమనార్హం.

అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల కేటాయింపులో అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ పైన ఉన్న కేసును కూడా కోర్టు శుక్రవారం కొట్టేసింది. ఆయనపై వేసిన ఛార్జిషీట్ నే హైకోర్టు కొట్టేయటం గమనార్హం. జగన్ అక్రమాస్తుల కేసుల్లో మంత్రులకు సంబంధం లేక, ఐఏఎస్ అధికారుల పాత్రా లేక, పారిశ్రామికవేత్తలకు-జగన్ కు మధ్య క్విడ్ ప్రోకో జరిగినట్లు ఆధారాలు లేకపోతే ఇక జగన్ అవినీతికి ఏవిధంగా పాల్పడ్డారన్నది పెద్ద ప్రశ్న.

జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసులన్నింటినీ కొట్టేస్తారనే అనిపిస్తోంది. దాదాపు నాలుగేళ్ళుగా అక్రమాస్తుల కేసులపై విచారణ జరుగుతున్నా ఒక్క కేసులో కూడా జగన్ అవినీతికి పాల్పడినట్లు సిబిఐ నిరూపించలేకపోయింది. అదే సమయలో పలువురిపై  కోర్టు కేసులను కొట్టేస్తోంది. అంటే జగన్ నిర్దోషిగా బయటపడే రోజు ఎక్కువ దూరంలో లేదన్న విషయం అర్ధమవుతోంది. అదికూడా సాధారణ ఎన్నికలు ముందే జరుగుతుండటం జగన్ కు పెద్ద ఊరటే.

click me!