వైసీపీ ఎంపీల రాజీనామాలు మళ్లీ పెండింగ్‌లో పడతాయా..?

First Published Jun 7, 2018, 6:45 PM IST
Highlights

వైసీపీ ఎంపీల రాజీనామాలు మళ్లీ పెండింగ్‌లో పడతాయా..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఎంపీలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ వాటిపై నిర్ణయం తీసుకోలేదు. కానీ.. బుధవారం స్పీకర్‌ను కలిసిన ఎంపీలు.. తమ రాజీనామాలు ఆమోదించాలని పట్టుబట్టడంతో సుమిత్రా మహాజన్ సుముఖత వ్యక్తం చేశారు.

తనకు మరోసారి రీకన్ఫర్మేషన్ లెటర్లు ఇస్తే.. రాజీనామాలు ఆమోదిస్తానని ఆమె చెప్పడంతో ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చేసారు. కానీ పరిస్థితులు చూస్తుంటే ఎంపీల రాజీనామాలు మరోసారి పెండింగ్‌లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికి రాజీనామాల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. కాగా, రేపటి నుంచి 10 రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పార్లమెంటరీ బృందంతో కలిసి లాత్వియా, బెలారస్‌లలొ పర్యటించనున్నారు. మళ్లీ భారత్ తిరిగి వచ్చేటప్పటికీ సమయం మించి పడిపోతుందని భావిస్తున్న ఎంపీలు రేపు మరోసారి స్పీకర్‌ను కలవాలని యోచిస్తున్నారు. రేపు ఏం జరగబోతుందో తెలియాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

click me!