చంద్రబాబు పారిపోయి బెజవాడ వచ్చారు

First Published Jun 7, 2018, 5:44 PM IST
Highlights

ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెజవాడకు పారిపోయి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

గుంటూరు: ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెజవాడకు పారిపోయి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అటువంటి చంద్రబాబు కేంద్రంపై ఏం పోరాటం చేస్తారని ప్రశ్నించారు.

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. టీడీపీ, బీజేపీలు తమ కుంభకోణాల విషయంలో సవాల్ చేసుకుంటున్నాయని గుర్తు చేస్తూ రెండు పార్టీలు వాటిని బయట పెట్టాలని అంబటి డిమాండ్ చేశారు.  
టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ లెవల్ కన్వినర్ల శిక్షణ తరగతుల రెండో రోజు కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు.

వైఎస్‌ జగన్ పాదయాత్ర ఒక అద్భుతమని, ప్రజల కోసం కష్టపడుతున్న ఇలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టమని విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య అన్నారు. నాయకుడికి పోరాట పటిమ అవసరమని, అది జగన్కే సాధ్యమన్నారు. పోలింగ్ బూత్ లెవల్ నుంచి కష్టపడి పనిచేస్తే జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆయన అన్నారు. 

click me!