ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి.. మృతుల్లో 9యేళ్ల చిన్నారి..

Published : Dec 29, 2023, 07:05 AM IST
ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి.. మృతుల్లో 9యేళ్ల చిన్నారి..

సారాంశం

ముగ్గురు పిల్లలతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. సైనేడ్ తాగి చనిపోయినట్లుగా సమాచారం. 

అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాద ఘటన వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులు ఓ నిండు కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాయి. కుటుంబంలోని ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

అనకాపల్లి జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. సైనేడ్ తాగి చనిపోయినట్లుగా సమాచారం. మృతులు శివరామకృష్ణ (40), మాధవి (30) పిల్లలు కుసుమ ప్రియ (9), లక్ష్మీ (13), వైష్ణవి (15)లుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే