కన్నా బీజేపీని వీడుతారా... వీర్రాజుపై ఆ మాటల వెనుక, అనుచరులతో కీలక భేటీ దేనికి..?

Siva Kodati |  
Published : Oct 19, 2022, 07:29 PM ISTUpdated : Oct 19, 2022, 07:30 PM IST
కన్నా బీజేపీని వీడుతారా... వీర్రాజుపై ఆ మాటల వెనుక, అనుచరులతో కీలక భేటీ దేనికి..?

సారాంశం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్టీ మారుతారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.   

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా వీర్రాజు వ్యవహారశైలిపై పలువురు గుర్రుగా వున్నారు. కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేదు. అయితే కన్నా మాత్రం నేరుగా టార్గెట్ చేశారు. ఇది సోముపై అసంతృప్తా... లేదంటే బీజేపీపైనా అన్నది మాత్రం తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడే యోచనలో వున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 

సీనియర్ నేతగా.. మాజీ అధ్యక్షుడిగా వున్న తనకు పార్టీ కార్యక్రమాలపై ఎలాంటి సమాచారం అందడం లేదని కన్నా తీవ్ర అసహనంతో వున్నారు. పలుమార్లు ఈ విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో తన రాజకీయ జీవితం, కుమారుడి భవిష్యత్‌ను దృష్టిలో వుంచుకుని కీలక నిర్ణయం తీసుకోవాలని లక్ష్మీ నారాయణ భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గుంటూరులోని తన ముఖ్య అనుచరులతో ఆయన కీలక సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం వుంది.

ALso Read: ఏపీ బీజేపీలో ‘‘కన్నా’’ కలకలం : ఎవరూ స్పందించొద్దు, కేడర్‌కు వీర్రాజు ఆదేశం.. రాత్రికి బెంగళూరులోనే

ఒకవేళ పార్టీ మారాలని నిర్ణయించుకుంటే కన్నా లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి వెళ్లే అవకాశాలైతే లేవు... తొలి నుంచి జగన్ తీరుపై కన్నా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా వున్న కన్నా.. జగన్‌ పరిపాలనపై అనేకసార్లు విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబుపై అసెంబ్లీలోనూ, బయట తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తేవారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుతో ఆయన క్లోజ్‌గానే వుంటున్నారు. పలు వేదికలను వీరిద్దరూ పంచుకున్నారు. ఇక మరో ఆప్షన్ జనసేన. కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ తన వర్గానికే చెందిన పవన్ పార్టీలో చేరే దానిపైనా ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?