శవ రాజకీయాలు చేస్తున్నారు.. మండిపడ్డ చినరాజప్ప

Published : Feb 20, 2019, 11:21 AM IST
శవ రాజకీయాలు చేస్తున్నారు.. మండిపడ్డ చినరాజప్ప

సారాంశం

వైసీపీ, బీజేపీలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఏపీ హోం మంత్రి చినరాజప్ప మండిపడ్డారు.

వైసీపీ, బీజేపీలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఏపీ హోం మంత్రి చినరాజప్ప మండిపడ్డారు. ఇటీవల కోటయ్య అనే రైతు మృతి చెందగా.. వైసీపీ, బీజేపీలు ప్రభుత్వంపై ఆరోపణలు  చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై చినరాజప్ప స్పందించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారని చెప్పారు. రైతు కోటయ్య ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, అలాంటి పోలీసులపై వారే చంపారని నిందలు వేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. 

టికెట్లు రానివారే పార్టీ వీడుతున్నారని ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చకున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారి స్థానంలో మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే