భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య..

Published : Sep 06, 2021, 08:15 AM ISTUpdated : Sep 06, 2021, 08:26 AM IST
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య..

సారాంశం

భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వీరు ఒకే ఇంట్లో రెండు వేర్వురు గదుల్లో ఉండేవారు. ఇటీవల కోరంగి పోలీస్ స్టేషన్ లో గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిర్చారు

కట్టుకున్న భర్తను ఓ మహిళ.. గొడ్డలితో నరికి చంపేసింది. ఈ దారుణ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలో లక్ష్మీపతిపురంలో జరిగింది.  పూర్తి వివరాల ప్రకారం...  గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)కు ఐ.పోలవరం మండలం కొమరగిరికి చెందిన దేవితో 12ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదో తరగతి చదివే కుమార్తె, మూడో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.

కాగా.. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వీరు ఒకే ఇంట్లో రెండు వేర్వురు గదుల్లో ఉండేవారు. ఇటీవల కోరంగి పోలీస్ స్టేషన్ లో గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఈ గొడవ విషయం అప్పారావు పనిచేస్తున్న కంపెనీలో తెలిసి పనిలో నుంచి తొలగించారు.

అప్పటి నుంచి అప్పారావు ఇంట్లోనే ఉంటూన్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మరింత పెరిగిపోయాయి. ఈ క్రమంలో.. ఆవేశంలో భార్య.. భర్తను గొడ్డలితో నరికి చంపేసింది. నిందితురాలు ప్రస్తుతం పరారీలో ఉండటం గమనార్హం. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్