అప్పులోళ్ల బాధ తట్టుకోలేక.. భార్య పేరుపై ఇన్సూరెన్స్ చేయించి... గ్యాస్ లీక్

By sivanagaprasad kodatiFirst Published Oct 30, 2018, 11:47 AM IST
Highlights

అప్పులోళ్ల బాధ తట్టుకోలేక వారి అప్పులు తీర్చడానికి ఓ భర్త మాస్టర్ ప్లాన్ వేశాడు. కట్టుకున్న భార్య పేరిట ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు. కడప జిల్లా బూసిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గజ్జల రామ సుబ్బారెడ్డికి అదే గ్రామానికి చెందిన మల్లేశ్వరితో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

అప్పులోళ్ల బాధ తట్టుకోలేక వారి అప్పులు తీర్చడానికి ఓ భర్త మాస్టర్ ప్లాన్ వేశాడు. కట్టుకున్న భార్య పేరిట ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు. కడప జిల్లా బూసిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గజ్జల రామ సుబ్బారెడ్డికి అదే గ్రామానికి చెందిన మల్లేశ్వరితో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ పోషణ నిమిత్తం ఇతని కుటుంబం అనంతపురం జిల్లా సీకే దిన్నె గ్రామంలో స్థిరపడింది.

పనిపాటా లేకుండా కాలక్షేపం చేసే సుబ్బారెడ్డి భార్య తెచ్చే కూలి డబ్బుల మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించిన అతను తెలిసిన వారి వద్ద నుంచి అప్పు చేసి కొన్ని స్థలాలను కొనుగోలు చేశాడు. అయితే ధరలు తక్కువగా ఉండటంతో.. వాటిని అమ్మకుండా అలాగే ఉంచాడు.

కానీ ఎంతకు తమ సొమ్ము చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారులు సుబ్బారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. చేసిన అప్పుడు వడ్డీతో కలిపి రూ.6 లక్షలకు చేరుకుంది. దీంతో మల్లేశ్వరి త్వరగా అప్పు తీర్చేయాలని భర్తపై ఒత్తిడి తెచ్చింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో రామసుబ్బారెడ్డికి ఒక ఉపాయం తట్టింది.

భార్య పేరిట ఇన్సూరెన్స్ చేయించి ఆమెను చంపి.. ఇన్సూరెన్స్ సొమ్ముతో అప్పు తీర్చాలనుకున్నాడు. పథకంలో భాగంగా రూ.6 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి... అనంతరం ఇంటి వంటగదిలో ఉన్న గ్యాస్‌ను లీక్ చేశాడు. తలుపులు మూసేసి భార్య కిచెన్‌లోకి వెళ్లిన తర్వాత తాను బయటకు వచ్చేశాడు.

ఈ సమయంలో మల్లేశ్వరి స్టవ్ వెలిగించడంతో మంటలు చెలరేగాయి. వెంటనే సుబ్బారెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. మంటలను గమనించిన స్థానికులు.. వెంటనే ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. 90 శాతం శరీరం కాలిపోవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటనపై సీకే దిన్నే పోలీసులు కేసు నమోదు చేసుకుని.. రామసుబ్బారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

click me!