భర్తను భయపెడదామని ట్యాబ్లెట్స్ మింగింది.. చివరకు..!

Published : Aug 06, 2021, 09:48 AM IST
భర్తను భయపెడదామని ట్యాబ్లెట్స్ మింగింది..  చివరకు..!

సారాంశం

గత కొద్ది నెలలుగా కుటుంబ సమస్యలతో వీరు తరచూ గొడపవేవారని.. గురువారం కూడా వీరు మళ్లీ గొడవపడ్డారని తెలుస్తోంది.  

భర్తను భయపెట్టాలని ఓ వివాహిత ఐరన్ ట్యాబ్లెట్స్ మిగింది. చివరకు ప్రాణాలకు మీదకు తెచ్చుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలుం శింగవరం గ్రామంలో చోటుచేసుకుంది.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆళ్ల గడ్డ నియోజకవర్గంలోని నేలంపాడు గ్రామానికి చెందిన శివమ్మ(28)ను.. కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన రఘుకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఏడు నెలల పసిపాప ఉంది. గత కొద్ది నెలలుగా కుటుంబ సమస్యలతో వీరు తరచూ గొడపవేవారని.. గురువారం కూడా వీరు మళ్లీ గొడవపడ్డారని తెలుస్తోంది.

ఈ క్రమంలో.. శివమ్మ.. భర్తను భయపెట్టాలని అనుకుంది. వెంటనే ఇంట్లో ఉన్న ఐరన్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా మింగేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్