చనిపోయిన భర్తకు గుడికట్టి పూజలు చేస్తున్న భార్య..

Published : Aug 09, 2021, 04:21 PM IST
చనిపోయిన భర్తకు గుడికట్టి పూజలు చేస్తున్న భార్య..

సారాంశం

ప్రకాశం జిల్లా పొదిలి మండలం, నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతి భార్యభర్తలు. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో అంకిరెడ్డి మృతి చెందాడు. అప్పటినుంచి పద్మావతి భర్తనే స్మరించుకుంటూ ఉంది.

పతియే ప్రత్యక్ష దైవం అనే మాటల్ని ఆమె నిజం చేసింది. కడదాకా కలిసుంటానని బాస చేసిన భర్త అర్థాంతరంగా తనువు చాలించడంతో భార్య తట్టుకోలేకపోయింది. భర్తను తలుచుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో భర్తను దైవంగా బావించే ఆమె ఏకంగా ఓ గుడికట్టించింది. నిత్యం పూజలతో తన దైవాన్ని కొలుస్తోంది.

ప్రకాశం జిల్లా పొదిలి మండలం, నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతి భార్యభర్తలు. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో అంకిరెడ్డి మృతి చెందాడు. అప్పటినుంచి పద్మావతి భర్తనే స్మరించుకుంటూ ఉంది.

అతన్ని మరిచిపోలేక.. తాజాగా భర్త పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించింది.. ముమ్మూర్తులా భర్తలానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి.. నిత్యం పూజలు చేస్తోంది. సమాజసేవకులను సన్మానాలు కూడా చేస్తోంది. భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతో కుమారుడు శివశంకర్ రెడ్డితో కలిసి ఆమె సేవలు చేస్తోంది. 

అంతేకాదు.. ప్రతి పౌర్ణమికి.. శని, ఆదివారాల్లో పేదలకు భర్త పేరుమీద  అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అలా భర్తను సేవిస్తూ.. అతను తనను విడిచిపోయినా ఆయన మీది ప్రేమను చాటుకుంటోంది. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్