చెట్టంత కొడుకును కొట్టి చంపి, ఇంటివెనుక పాతిపెట్టిన కన్నతల్లి..

Published : Jul 22, 2022, 07:23 AM IST
చెట్టంత కొడుకును కొట్టి చంపి, ఇంటివెనుక పాతిపెట్టిన కన్నతల్లి..

సారాంశం

తాగుడుకు బానిసై చిత్రహింసలు పెడుతున్న కొడుకును అనుకోకుండా చంపిందో తల్లి. ఆ తరువాత ఏం చేయాలో తెలీక ఇంటి వెనకే పూడ్చి పెట్టింది. కానీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కోడలికి చెప్పింది. దీంతో... 

బాపట్ల : తాగుడు వ్యసనాలకు బానిసైన కొడుకును.. జన్మనిచ్చిన తల్లే హతమార్చింది. ఆ తరువాత అతని మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ దారుణ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా.. అద్దంకి నియోజకవర్గం.. సంతమాగులూరు మండలం.. అడవి పాలెం గ్రామానికి చెందిన ఆకుల సీతారావమ్మ, పుల్లయ్య దంపతులకు మహంకాళి రావు, బాజీ ఇద్దరు కుమారులు. పదేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో పుల్లయ్య మృతి చెందారు. దీంతో సీతారామమ్మ పెద్ద కుమారుడు మహంకాళి రావు (37)ను తన మేనకోడలు మాదలకు చెందిన శ్రీ లక్ష్మీకి ఇచ్చి వివాహం చేసింది.

వీరికి ఇద్దరు మగపిల్లలు. మద్యం వ్యసనాలకు బానిసైన మహంకాళి రావు భార్యను, తల్లిని తరచూ వేధిస్తుండేవాడు. దీంతో అతని భార్య తన ఇద్దరు బిడ్డల్ని పుట్టింట్లో వదిలేసింది. తాను అత్లింట్లోనే ఉండి వారిని పోషించుకుంటుండేది. అయితే,  నాలుగు నెలల క్రితం భర్త వేధింపులు అధికం కావడంతో తాను కూడా పుట్టింటికి వెళ్ళి పోయి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ రాత్రి సమయంలో మహంకాళి తాగి వచ్చి తల్లితో గొడవపడి.. ఆమె మీద దాడికి దిగాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ.. అతని చేష్టలతో విసిగిపోయిన తల్లి.. తన చేతిలో ఉన్న కర్రతో కొడుకును కొట్టింది. అయితే, ఆ కర్ర అనుకోకుండా అతని ఆయువుపట్టుపై తగిలింది. దీంతో మహంకాళి అక్కడికక్కడే మృతిచెందాడు.

విశాఖలో దారుణం.. కుళ్లిన స్థితిలో మృతదేహం.. వీడిన మర్డర్ మిస్టరీ..?

అలా జరుగుతుందని ఊహించని తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో చిన్న కొడుకు సహాయంతో మృతదేహాన్ని తాము ఉండే పెంకుటింటి వెనక భాగంలోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టారు.ఇంటి ముందు వరండాలో వంట చేసుకుంటూ వారం రోజులుగా వారిద్దరూ అదే ఇంట్లో గడిపారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీతారావమ్మ,  చిన్న కొడుకు బాజీ ఈ ఘటన తరువాత తీవ్రంగా మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కోడలు శ్రీలక్ష్మిని ఇంటికి పిలిపించి జరిగిన  సంఘటన వివరాలు  చెప్పారు.

వెంటనే మృతుడి భార్య గురువారం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగశివరెడ్డి తెలిపారు. మృతదేహం ఉన్నతాధికారులు, వైద్యుల బృందం సమక్షంలో శుక్రవారం వెలికి తీయించి, పోస్ట్ మార్టం చేయించనున్నట్లు వివరించారు. ఘటనా స్థలాన్ని బాపట్ల డిఎస్పి ఏ శ్రీనివాసరావు, సంతమాగులూరు సీఐ శివరామ కృష్ణారెడ్డి పరిశీలించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి