
నెల్లూరు : నెల్లూరులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన చోటుచేసుకుంది. భర్త అంత్యక్రియలకు వచ్చిన భార్య, ఆమె తండ్రి, అమ్మమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలి పేరు మౌనిక. ఆమె భర్త మధు ఇటీవల మరణించాడు. అతని అంత్యక్రియల కోసం మౌనిక, తండ్రి క్రిష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మలతో కలిసి అత్తగారింటికి వచ్చింది.
కాగా, రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వీరి ముగ్గురిని మధు కుటుంబ సభ్యులు హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. రాత్రి ఇంట్లో పడుకున్నా వీరు ముగ్గురు ఉదయానికి మృతులుగా కనిపించారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయ వివరాలు తెలియాల్సి ఉంది.