ఏపీలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో భార్యకు జీవిత ఖైదు.. పెళ్లైన వారానికే ఘాతుకం

By Mahesh KFirst Published Nov 12, 2022, 6:22 AM IST
Highlights

కాకినాడలో ఓ భార్య.. ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చింది. పెళ్లి చేసుకున్న వారం రోజులే భర్తను చంపేయించింది. ఈ నేరం రుజువుకావడంతో ఆమెకు, ఆమె ప్రియుడికి యావజ్జీవ శిక్ష పడింది.
 

హైదరాబాద్: పెళ్లి చేసుకున్న వారం రోజులకే ఆ యువకుడు బలిపశువయ్యాడు. ఇష్టం లేని కాపురం చేయాల్సి వస్తుందని ఆయనను పెళ్లి చేసుకున్న భార్య, తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. ముందుగా చేసిన ప్లాన్ ప్రకారమే భర్తను హత్య చేశారు. ఈ కేసులో కాకినాడ 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ హత్య కేసులో మృతుడి భార్యకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చినట్టు పోలీసులు వివరించారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, కాకినాడ జిల్లా కరపకు చెందిన పేకేటి సూర్యనారాయణ అదే మండలంలోని పేపకాలయపాలేనికి చెందిన నాగలక్ష్మీతో పెళ్లి జరిగింది. సూర్యనారాయణ మండపేటలోని ఓ కాలేజలో మ్యాథ్స్ లెక్చరర్‌గా చెప్పేవాడు. 2019 మే నెలలో వీరిద్దరికీ వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న వారం రోజులకే ఇంటి నుంచి బయటకు వెళ్లిన సూర్యనారాయణ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు.

పెళ్లి చేసుకున్న మే నెలలోనే 21వ తేదీన సూర్యనారాయణ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ, తిరిగి రాకపోవడంతో బంధుమిత్రులు అతనికి కోసం గాలించడం మొదలు పెట్టారు. పెనుగుదురు పాతర్లగడ్డ రహదారి వద్ద ఓ ఖాళీ స్థలంలో కత్తిపోట్లతో ఓ డెడ్ బాడీ వారికి కనిపించింది. కానీ, మర్డర్ కు సంబంధించి స్పాట్‌లో ఆధారాలే లేకపోవడంతో పోలీసులు ఈ కేసు మిస్టరీ ఛేదించడాన్ని సవాల్‌గా స్వీకరించారు.

Also Read: తన పెళ్లికాకుండా మంత్రగత్తెలా అడ్డుపడుతోందని.. తల్లిని చంపిన తనయుడు

సూర్యనారాయణను పెళ్లి చేసుకున్న నాగలక్ష్మీతో పేపకాయలపాలేనికి చెందిన కర్రి రాధాకృష్ణతో వివాహేతర సంబంధం ఉన్నది. కర్రి రాధాకృష్ణ స్థానిక పంచాయతీలో టెంపరరీగా ప్లంబింగ్‌గా పని చేసేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లల. 

నాగలక్ష్మీకి ఇష్టం లేని పెళ్లి కావడంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడిని కోరింది. ఇద్దరూ సూర్యనారాయణ హత్యకు ప్లాన్ వేశారు. అప్పటికే నాగలక్ష్మీ సూర్యనారయణకు రాధాకృష్ణను పరిచయం చేసింది.

సూర్యనారాయణను రాధాకృష్ణ పార్టీ కావాలని అడిగి ఓ ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత పదునైన కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం, డెడ్ బాడీపై ఎండుగడ్డి వేసి ఆయుధాన్ని, రక్తపు మరకలు అంటిన దుస్తులను సమీపంలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయాడు. సూర్యనారాయణను చంపేసినట్టు రాధాకృష్ణ.. నాగలక్ష్మీకి తెలిపాడు.

దీంతో ఆమె భర్త ఫోన్‌కు 28 సార్లు ఫోన్ చేసింది. మిస్డ్ కాల్స్ పడ్డాయి. ఇన్ని సార్లు ఫోన్ చేసినా భర్త ఫోన్ లిఫ్ట్ చేయడంల లేదని, కనిపించడం లేదనే నాటకానికి నాగలక్ష్మీ తెరతీసింది. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. వీరిలో రాధాకృష్ణ కూడా చేరడం గమనార్హం. చివరకు ఆయనే ఫాలానా చోట వెతికారా? అంటూ మృతుడి సోదరులను ప్రశ్నించాడు. 

రాధాకృష్ణపై ఎస్సైకి అనుమానం వచ్చి తనదైన శైలిలో విచారించగా, వాస్తవాలు బయటకు వచ్చాయి. అదే నెల 30న రాధాకృష్ణ, నాగలక్ష్మీలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నేరం రుజువైంది. వారికి కోర్టు రూ. 5 వేల చొప్పున జరిమానా విధించి, ఇద్దరికీ యావజ్జీవ శిక్ష వేసింది. 

click me!