విశాఖలో కానిస్టేబుల్ హత్య .. భార్యే హంతకురాలు, ప్రియుడితో కలిసి చంపి .. ఆపై గుండెపోటు డ్రామా

Siva Kodati |  
Published : Aug 03, 2023, 06:22 PM IST
విశాఖలో కానిస్టేబుల్ హత్య .. భార్యే హంతకురాలు, ప్రియుడితో కలిసి చంపి .. ఆపై గుండెపోటు డ్రామా

సారాంశం

విశాఖలో కానిస్టేబుల్ దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతోంది. మృతుడి భార్యే తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడి సాయంతో రమేష్‌ను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది

విశాఖలో కానిస్టేబుల్ దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతోంది. మృతుడి భార్యే తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడి సాయంతో రమేష్‌ను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. రమేశ్ భార్య శివాని ఇంట్లోనే పక్కా స్కెచ్‌తో భర్తను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై దానిని గుండెనొప్పిగా చిత్రీకరించింది. అలాగే గుట్టుచప్పుడు కాకుండా రమేష్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడంతో శివాని కుట్ర వెలుగులోకి వచ్చింది. శివానికి ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో అక్రమ సంబంధం వున్నట్లుగా తెలుస్తోంది. మృతుడు బర్రి రమేష్ 2009లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?