చంద్రబాబును కలిసిన వైసిపి ఎంఎల్ఏ..సంచలనం

Published : Feb 03, 2018, 04:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
చంద్రబాబును కలిసిన వైసిపి ఎంఎల్ఏ..సంచలనం

సారాంశం

కొద్దిసేపు చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

చంద్రబాబునాయుడును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా శనివారం కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. కొద్దిసేపు చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు. అయితే ముస్తాఫా టీడీపీలో చేరుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. అయితే ఈమధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు తగ్గాయి. ఈ నేపధ్యంలో సీఎంతో ముస్తఫా భేటీ కావడం ఇప్పుడు కలకలం రేగుతోంది.

 

టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ముస్తఫా చాలా చురుకుగా ఉండేవారు. ఇటీవల ఆర్టీయే అధికారులపై టీడీపీ నేతల ప్రవర్తనను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ముస్తఫా అయితే ఏకంగా గేటు ఎక్కారు. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. గేటు దిగిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీలో చురుగ్గా ఉన్న ముస్తఫా చంద్రబాబుతో సమావేశం కావడం ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu