జగన్ తోనే బిజేపి..కేంద్రం గ్రీన్ సిగ్నల్ ?

First Published Feb 3, 2018, 3:16 PM IST
Highlights
  • రాజకీయ సమీకరణలను సైతం మార్చేసేట్లే కనబడుతోంది.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపిలో ఎన్నో సంచలనాలకు తెరలేపుతోంది. రాజకీయ సమీకరణలను సైతం మార్చేసేట్లే కనబడుతోంది. నిజానికి కేంద్ర బడ్జెట్లో ఏపి ప్రయోజనాలకు మొండి చెయ్యి చూపిందన్నది వాస్తవం. రాజధాని, పోలవరంకు నిధులు, మెట్రో ప్రాజెక్టులకు డబ్బులు, రెవిన్యూ లోటు భర్తీ, అసెంబ్లీ సీట్ల పెంపు.. ఇలా ఏ విషయంలో చూసిన ఏపిని దెబ్బకొడుతూనే, చంద్రబాబుకు కూడా బాగా సున్నం పెట్టింది.

అదే విషయంపైన రాష్ట్రంలో భాజపా తప్ప మిగిలిన రాజకీయపార్టీలన్నీ కేంద్రంపై మండిపోతున్నాయి. సరే, జనాలు కూడా చాలా చోట్ల నిరసనలు తెలుపుతూ రోడ్లపైకి వచ్చారు. టిడిపిలో చంద్రబాబునాయుడు తప్ప చాలా మంది నేతలు కేంద్రాన్ని అమ్మనాబూతులు తిడుతున్నారు.

‘పుండుమీద కారం రాసినట్లు’గా భాజపా ఎంఎల్సీ సోమువీర్రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ తాజా బడ్జెట్ బ్రహ్మాండమన్నారు. అంతటితో ఆగితే బాంగుండేది. కానీ వీర్రాజు పాత పురాణమంతా బయటపెడుతున్నారు. ‘గతంలోనే పోలవరాన్ని కేంద్రానికి అప్పగిస్తామని చెప్పిన చంద్రబాబు కొత్త కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారం’టూ ప్రశ్నించటం సంచలనంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో సింహభాగం కేంద్రం నిధులే అన్నారు.

సరే, వీర్రాజు విమర్శలను పక్కన పెడితే బడ్జెట్ పై ఒక వైపు టిడిపి నేతలు బాహాటంగానూ చంద్రబాబు అంతర్గత సమావేశాల్లోను మండిపడుతున్నారు. అదే సమయంలో వీర్రాజు మాత్రం చంద్రబాబు లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల గురించి ఆందోళన అనవసరమని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపి బిజెపి నేతలకు స్పష్టం చేయటం ఇంకా విచిత్రంగా ఉంది. ఇపుడున్న సీట్ల సంఖ్యకే ఎన్నికలు జరుగుతాయని అమిత్ తేల్చి చెప్పటం చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టేదే.

ముందు బడ్జెట్, తర్వాత అమిత్ షా వ్యాఖ్యలు తాజాగా వీర్రాజు కామెంట్లు చూస్తుంటే చంద్రబాబు-బిజెపి విడిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేయలేని బిజెపి చివరకు వైఎస్ జగన్ తో చేతులు కలపటంపై సానుకూలంగా ఉన్నట్లే సంకేతాలందుతున్నాయ్.

 

click me!