ఆర్కె బీచ్ విగ్రహాల తొలగింపు: హరికృష్ణ విగ్రహంతోనే పేచీ

By telugu teamFirst Published May 14, 2019, 5:00 PM IST
Highlights

దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వర రావు విగ్రహాల స్థాపనపై పెద్దగా ఎవరికీ అభ్యంతరం లేదు.  ఇద్దరు కూడా సినీ, సామాజిక రంగాల్లో విశేషంగా కృషి చేసినవారు. 

విశాఖపట్నం: విశాఖపట్నం రామకృష్ణ బీచ్ (ఆర్కె బీచ్)లో విగ్రహాల ప్రతిప్ఠాపనపై తీవ్ర వివాదం చెలరేగుతూ వస్తోంది. చివరికి సోమవారం అర్థరాత్రి మూడు విగ్రహాలను జీవిఎంసి అధికారులు కూల్చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు, ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావుతో పాటు తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడు హరికృష్ణ విగ్రహాలను కూల్చేశారు. 

నిజానికి, దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వర రావు విగ్రహాల స్థాపనపై పెద్దగా ఎవరికీ అభ్యంతరం లేదు.  ఇద్దరు కూడా సినీ, సామాజిక రంగాల్లో విశేషంగా కృషి చేసినవారు. దాసరి నారాయణ రావు సినీ దర్శక నిర్మాత మాత్రమే కాకుండా రచయిత, నటుడు, గిన్నీస్ రికార్డులోకి ఎక్కిన వ్యక్తి. పత్రికా రంగంలో కూడా రాణించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

అక్కినేని నాగేశ్వర రావు ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత కూడా. నియమాలు ఉల్లంఘించినప్పటికీ వారి విగ్రహాలపై పెద్దగా అభ్యంతరం ఉండేది కాదంటున్నారు స్థానికులు. అయితే, వారి విగ్రహాలతో పాటు హరికృష్ణ విగ్రహం స్థాపించడం పేచీ ప్రారంభమైంది. అది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. 

హరికృష్ణ స్థానికుడు కాదు. పైగా పెద్దగా జాతీయ స్థాయిలో పేరు గడించిన నేత కూడా కారు. దాంతో ఆ విగ్రహ ప్రతిష్టాపనపై స్థానికులు ఆగ్రహం వ్క్తం చేశారు. ఈ విగ్రహాల ఏర్పాటుకు జీవీఎంసి నుంచి అనుమతులు కూడా తీసుకోలేదు. దీంతో విగ్రహాలను తొలగించాల్సిందేనని ఉద్యమాలు చేశారు. దాంతో చివరకు ఆ మూడు విగ్రహాలను అధికారులు కూల్చేశారు. 

సంబంధిత వార్త

గంటాకు షాక్: హరికృష్ణ, దాసరి, అక్కినేని విగ్రహాల తొలగింపు(వీడియో)

click me!