పోలీసులు ఓవర్ యాక్షన్ చేసారా?

First Published Oct 30, 2017, 12:32 PM IST
Highlights
  • వైసీపీ నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ కొడుకు జక్కంపూడి రాజా విషయంలో ఓవర్ యాక్షన్ చేసినట్లే ఉన్నారు.
  • ఓ ఎస్ఐ ఓవర్ యాక్షన్ వల్ల చిన్న విషయం పెద్దదై కూర్చుంది.

వైసీపీ నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ కొడుకు జక్కంపూడి రాజా విషయంలో ఓవర్ యాక్షన్ చేసినట్లే ఉన్నారు. ఓ ఎస్ఐ ఓవర్ యాక్షన్ వల్ల చిన్న విషయం పెద్దదై కూర్చుంది. ఆదివారం సాయంత్రం ద్రాక్షారామం నుండి రాజమండ్రి వైపు రాజా తన భార్య రాజశ్రీ, ఐదుమాసాల పాపతో కారులో వస్తున్నారు. మధ్యలో రామచంద్రాపురంకు చేరుకోగానే ఓ నగల దుకాణం కనిపించింది. దాంతో రాజా భార్య కారును ఆపించి దుకాణంలోకి వెళ్ళింది. రాజా చేతిలో పసిపాప ఉన్నది.

ఇంతలో ఓ ఎస్ఐ నాగరాజు వచ్చి దుకాణం ముందు నిలిపిన కారును తీసేయాలని ఆదేశించారు. తన చేతిలో పసిపాప ఉందని, పాపను భార్యకు ఇచ్చి కారును తీస్తానని చెప్పాడు రాజా. మరి ఏమైందో ఏమో ఎస్ఐకి, రాజా చెప్పిన మాటలు పట్టించుకోకుండా రాజా షర్ట్ కాలర్ పట్టుకుని కారులోనుండి బయటకు లాగేసారు. అంతేకాకుండా తోసుకుంటూ వెళ్ళి పోలీసు జీపులో కూర్చోబెట్టారు. ఎప్పుడైతే బయట గొడవను గమనించగానే వెంటనే దుకాణంలోని రాజా భార్య బయటకు వచ్చేసి పసిపాపను తీసుకుంది.

విచిత్రమేమిటంటే, రాజాను పోలీసు జీపులోనే స్టేషన్ కు తీసుకెళ్ళిన పోలీసులు అక్కడ చితక్కొట్టేసారు. అంటే రాజాను కొట్టాలని పోలీసులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నట్లుంది చూడబోతే. ఎప్పుడైతే విషయం బయటకు పొక్కిందో వెంటనే జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు రామచంద్రాపురం చేరుకున్నారు. పోలీసు స్టేషన్ బయట ఆందోళన మొదలుపెట్టారు. రాజా ఒంటిమీదున్న వాతలు చూస్తుంటే తమ నేతలను ఎంతలా కొట్టారో అర్ధమైపోతోందని వైసీపీ నేత, మాజీ ఎంఎల్ఏ కురసాల కన్నబాబు మండిపడ్డారు. అందుకే ఎస్ఐ తీరుకు నిరసనగా సోమవారం జిల్లా బంద్ పాటించారు.

 

click me!