ఆందోళన స్పష్టంగా తెలిసిపోతోంది..

Published : Jul 13, 2017, 05:45 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఆందోళన స్పష్టంగా తెలిసిపోతోంది..

సారాంశం

జగన్ నుండి ప్రకటన రాగానే మంత్రులు, నేతల్లో అంత ఉలికిపాటు ఎందుకో అర్ధం కావటం లేదు. అధికారంలోకి రావటానికి ఎవరి వ్యూహాలు వారికుంటాయి. దాన్ని ఎదుటి వారు ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు నిజానికి. చంద్రబాబుకైనా, జగన్ కైనా చివరకు పవన్తో పాటు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నది నిర్ణయించాల్సింది ప్రజలే కదా?

జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ప్రకటించిన దగ్గర నుండి మంత్రులు తెగ ఆందోళన పడిపోతున్నారు. పాదయాత్ర ఎలా చేయాలి? కోర్టుల్లోని కేసుల సంగతేంటని జగన్ ఆలోచించకుండానే పాదయాత్ర ప్రకటన చేస్తారా? ఇక, నవరత్నాల హామీలపై కూడా అంతో ఇంతో జగన్ కసరత్తు చేసే ఉంటారు కదా? వివిధ అంశాలపై జగన్ కు సలహాలిచ్చే నిపుణులు వైసీపీలో కూడా ఉన్నారన్న విషయం టిడిపి మరచిపోతోంది. తన రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా మలుచుకోవాలో జగన్ కు తెలీదా?

 

జగన్ నుండి ప్రకటన రాగానే మంత్రులు, నేతల్లో అంత ఉలికిపాటు ఎందుకో అర్ధం కావటం లేదు. అధికారంలోకి రావటానికి ఎవరి వ్యూహాలు వారికుంటాయి. దాన్ని ఎదుటి వారు ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు నిజానికి. చంద్రబాబుకైనా, జగన్ కైనా చివరకు పవన్తో పాటు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నది నిర్ణయించాల్సింది ప్రజలే కదా?

 

కానీ జగన్ ప్రకటించిన నవరత్నాల హామీలపై మంత్రుల్లో కలవరపాటు స్పష్టంగా కనబడుతోంది. ఇదే విధమైన ఆందోళన చంద్రబాబునాయుడులో కూడా కనబడుతున్నప్పటికీ బయటపడకుండా మ్యానేజ్ చేస్తున్నారు. గురువారం నాడు పలువురు మంత్రులు జగన్ పాదయాత్రతో పాటు హమీలపైన కూడా విరుచుకుపడుతున్నారు.  పాదయాత్ర ఎలా చేస్తారు? ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిన జగన్ కు పాదయాత్ర సాధ్యమవుతుందా? అని నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నిస్తారు.

 

రెండేళ్ళుండగానే మ్యానిఫెస్టో ప్రకటించటింటమేంటని కాలువ శ్రీనివాసులు ప్రశ్నిస్తున్నారు. పాదయాత్ర చేసినంత మాత్రానా జనాలు ఓట్లేస్తారా అంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు దీర్ఘాలు తీస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొదుకు అన్న అర్హత తప్ప సిఎం అయ్యేందుకు జగన్కున్న అర్హతేంటని మంత్రి నిలదీస్తున్నారు.

 

జగన్ ఉండేది జైలులోనే అంటూ మంత్రి పరిటాల సునీత అక్కసంతా వెళ్లగక్కారు. జగన్ను కేసుల నుండి కాపాడటం ఎవరి తరమూ కాదని కూడా అన్నారు. ప్రశాంత్ కిషోర్ వైసీపీ జెండాను పీకేయటం ఖాయమని అమరనాధరెడ్డి జోస్యం చేప్పారు. మంత్రుల ప్రకటనలు, అక్కసు చూస్తుంటే ఆందోళన స్పష్టంగా కనబడటం లేదూ?

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu