ఆ కంపెనీతో ఢిల్లీలో బాబు ఎందుకు రహస్యంగా చర్చించారు: జగన్

First Published Jun 5, 2018, 6:46 PM IST
Highlights

అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసే కుట్ర

తణుకు:అగ్రిగోల్డ్  ఆస్తులను బినామీ పేర్లతో  సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి  కృషి చేస్తామని జగన్ ప్రకటించారు.


పశ్చిమ గోదావరిజిల్లా తణుకులో మంగళవారం నాడు నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో నిర్వహించిన సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు.అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను పథకం ప్రకారంగా ప్రభుత్వం తగ్గిస్తోందని జగన్ విమర్శించారు. తొలుత అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను రూ.35 వేల కోట్లుగా ఉందన్నారు.సిఐడీ మాత్రం  అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను కేవలం రూ. 10 వేల కోట్లుగా  ప్రకటించిందన్నారు.  ఎస్ఎల్ కంపెనీ అగ్రిగోల్డ్  ఆస్తులను రూ.4 వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు  ముందుకు వచ్చిందన్నారు.

రూ.1100 కోట్లు కేటాయిస్తే 80 శాతం అగ్రిగోల్డ్ బాధితులకు ఉపశమనం కలుగుతోందని  గతంలో అసెంబ్లీ వేదికగా తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో వైసీపీ
అధికారంలోకి వస్తే  రూ. 1100 కోట్లను బడ్జెట్ లో  కేటాయిస్తామని ఆయన హమీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసేందుకు ప్రయత్నించిన వారిని ఎలా శిక్షించాలో తాను
చూసుకొంటానని వైఎస్ జగన్ చెప్పారు. ఎస్ఎల్ గ్రూప్‌తో న్యూఢిల్లీలో  చంద్రబాబునాయుడు  రహస్యంగా  ఎందుకు చర్చించారో చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో  ఇచ్చిన హమీలను అమలు చేయలేదన్నారు.

మట్టి, ఇసుక, ఖనిజ సంపదను కూడ చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదని ఆయన విమర్శించారు. గోదావరి నుండి యధేచ్ఛగా ఇసుకను అక్రమంగా
తరలించుకొనిపోతున్నారని జగన్ ఆరోపించారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డే లేకుండాపోయిందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలంతా అందినకాడికి దోచుకొంటున్నారని జగన్  విమర్శలు గుప్పించారు.

click me!