
అమరావతి పరిసరాలలో నిన్నప్రారంభమయిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు కు ప్రధాని మోదీ రాలేదు.
నిజానికి, ఆయన ఈ సదస్సును ప్రారంభించాల్సి ఉంది. ఎందుకంటే, పేరుచూస్తే పార్లమెంటు కుసంబంధించిన వ్యవహారం లాగా కనిపిస్తుంది. అందువల్ల ప్రధాని వస్తారని, ప్రారంభిస్తారని భావించారు. ఇదేది జరగలేదు . కారణం, ఈ సదస్సుకు ఇండియన్ పార్లమెంటురీ యూనియన్ , భారత పార్లమెంటు గుర్తింపు లేకపోవడమే. ఇది పూర్తి రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీ, దానికి సంబంధించి మరొక సంస్థ ఏర్పాటుచేసిన ప్రయివేటు దుకాణం. అందువల్ల దీని ఉద్దేశం అనుమానాలకు తావిస్తూ ఉంది. ఫలితంగా ప్రధాని ప్రారంభోత్సవానికి రాకుండా ఎగ్గొట్టారు. కారణం చెప్పలేదు.జాతీయ మహిళా పార్లమెంటు అని పేరున్నా స్టేజీ మీద చంద్రబాబు చిత్రమే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. వీడియో చూడండి.
తర్వాత ప్రధాని ఢిల్లీ నుంచి లైవ్ ప్రారంభ ప్రసంగం చేస్తారని భావించారు అదీ జరగలేదు. చివరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని చూపించి, ప్రధాని రాలేదు, ఆయన వెంకయ్యనాయుడిని తన ప్రతినిధిగా పంపించారని స్టేజీ మీది నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించిసభకు హాజరయిన వారందరికిసర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
ప్రధాని వస్తారన్న ప్రచారం జరగడంతో సభకు కూడా ప్రాధాన్యత పెరిగింది. ప్రధాని రాక కాబట్టి పోలీసు భారీ భద్రతా ఏర్పా ట్లు చేశారు. సదస్సు నిర్వాహణకు కూడా భారీగా ఖర్చుపెట్టారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక టాయిలెట్లకు ఏసి కూ డా బిగించారు. ఆహ్వాన పత్రికలు అచ్చేయించారు. తీరా ప్రధాని రావడం లేదని కేవలం వీడియో ద్వారా ప్రసంగిస్తారని సమాచారం రాగానే అంతకుముందు వేసిన ఆహ్వాన పత్రికలన్నీ మార్చేసి ప్రధాని వీడియో ద్వారా ప్రారంభించి మాట్లాడ తారని కొత్త పత్రికలు ముద్రించారు.
శుక్రవారం నాడు రిమోట్ ఇనాగరేషన్ కూడా లేదు. ఎందుకు?
కారణం ఏమంటే లేని అమరావతి రాజధానిలో ఏదో ఒక పెద్ద కార్యక్రమం జరిపి అక్కడ ఏదో జరగిపోతున్నదని ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నిప్రయివేటు సంస్థలతో కలసి ఏర్పాటు చేసిన పబ్లిసిటి స్టంటు అని ప్రధానికి తర్వాత బ్రీఫ్ చేశారని తెలిసింది. ఈ కార్యక్రమం మర్యాదగా కనిపించేందుకు దీనికి జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు అని పేరు పెట్టారు. ఈ సంస్థ స్థాపించాక దాని మొదటి సదస్సు ఇది అని చెప్పుకొచ్చారు. వచ్చిన అతిధులకు చక్కటి అతిధ్యం ఇచ్చారు. కిరణ్ బేడీలు లాంటి వాళ్లు ‘ నేను భవిష్యత్తు మహానగరాన్ని చూశాను’ అని సర్టిఫికేట్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఎక్కడో నిరుత్సాహం కనిపించింది. వచ్చేసారి మరొక రాష్ట్రం రెండవ సదస్సును నిర్వహించేందుకు ముందుకు రాకపోతే, మేమే నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ సభ పెద్ద బిజినెస్ ప్రొగ్రాం. మహారాష్ట్ర పుణేలోని ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల (ఇలాంటివి ఆంధ్రలో, తెలంగాణాలో చాలా ఉన్నాయి) మహారాష్ట్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి),దానిని వోనరు రాహుల్ కరాద్ స్థాపించిన భారతీయ ఛాత్ర సంసద్ (Indian student parliament) విజయవాడలో జరుగుతున్న జాతీయ మహిాళా పార్లమెంటు ( national women’s parliament)లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
రాహుల్ సరిగ్గా ఏడాది కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పుణేకి పిలిపించి భారత విద్యార్థి పార్లమెంటు ముగింపు సమావేశాలలో మాట్లాడించారు.
సన్మానించారు.అపుడు దాన్ని ఒక అంతర్జాతీయ గౌరవంగా టిడిపివోళ్లు ప్రచారం చేసుకున్నారు. ఆ స్నేహమే ఈ రోజుకి నేషనల్ విమెన్స్ పార్లమెంటు దాకా ఎదిగి పూతకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ తో డబ్బుల బాగా ఖర్చు పెట్టించి జాతీయ మహిళ పార్లమెంటు అనే దుకాణం పెట్టించారు. ఇప్పటికే రాజధానికి శంకుస్థాపన చేసి ప్రధానిమోదీ చెడ్డపేరు తెచ్చుకున్నారు. శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా ఒక్క ఇటుక పడలేదు. ఇపుడు విజయవాడకు వచ్చి ఈ జాతీయ మహిళ పార్లమెంటు అనే ప్రయివేటు దుకాణానికి ప్రారంభోత్సవం చేస్తే, రేపు ఇందులో ఏవయినా లొసుగులు బయటపెడితే ఎలా అని ప్రధాని అలోచించినట్లు న్నారు. జాతీయ మహిళ పార్లమెంటు సదస్సు నిర్వహణ భారత పార్లమెంటు పాత్ర ఏమిటో ఆరాతీశారని, పార్లమెంటుకు, నాయుడుగా రి జాతీయ మహిళ పార్లమెంటు మొదటి సదస్సుకు సంబంధమే లేదని తెలుసుకున్న తర్వాత ప్రధాని చడీ చప్పుడు చేయకుండా మానేశారని ఏషియానెట్ సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి అధికారిక కార్యక్రమం నాలుగు నెలల నుండి అదేపనిగా జాతీయ మహిళ పార్లమెంటు గురించి ప్రచారం చేస్తూ తెలిసిందే. సుమారు రూ. 50 కోట్ల నుంచి రు. 60 కోట్ల దాకా కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పుణే ఇంజనీరింగ్ కాలేజీ ఎంఐటికి అంత ప్రచారమెందుకీవాలి. ఇక్కడ అలాంటి కాలేజీలే,మేధావులు లేరా, రాహుల్ కరద్ కంటే తెలివైనోళ్లు లేరా... కదలని వర్ల్డు క్లాస్ క్యాపిటల్ దగ్గిర ఏదో ఒక కదలిక తెచ్చేందుకు ఈ నాటకమాడుతున్నారని అక్కడికి వచ్చిన వాళ్లను చూస్తే తెలుస్తుంది.
నేషనల్ విమెన్స్ పార్లమెంటు అన్నపుడు పార్లమెంటు అధ్వర్యంలో జరగాలి. అని రాష్ట్రాల అసెంబ్లీలకు పాత్ర ఉండాలి. ఇక్కడ అలాంటిదేమీ లేదు.
ః ఇందులో ఇంతకు మించిన కుంభకోణంమేమయినా దాగి ఉందా?