కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి: చంద్రబాబు స్కెచ్ ఇదీ...

First Published Jan 30, 2019, 12:14 PM IST

కర్నూల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలతో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం  చేసుకోవాలని టీడీపీ చీప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోట్ల ఫ్యామిలీకి టీడీపీలోకి ఆహ్వానం పలికారు.

కర్నూల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలతో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ చీప్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోట్ల ఫ్యామిలీకి టీడీపీలోకి ఆహ్వానం పలికారు.కోట్ల ఫ్యామిలీ ఫిబ్రవరి 6వ తేదీన టీడీపీలో చేరే అవకాశం ఉంది.
undefined
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. కర్నూల్ జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 11 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.
undefined
రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబునాయుడు కోట్ల ఫ్యామిలీని టీడీపీలోకి ఆహ్వానించారు.
undefined
కర్నూల్ ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి బుట్టా రేణుక విజయం సాధించారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడ టీడీపీలో చేరారు. కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కర్నూల్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి , ఎమ్మిగనూరు నుండి బీవి జయనాగేశ్వర్ రెడ్డి స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకొంది.మిగిలిన ఐదు సీట్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
undefined
ఇక నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు, డోన్ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. బనగానిపల్లెలో మాత్రమే టీడీపీ అభ్యర్ధి బీసీ జనార్ధన్ రెడ్డి నెగ్గారు. 2014 తర్వాత ఏపీలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామం వైసీపీకి ఇబ్బంది కల్గించింది. టీడీపీ రాజకీయంగా ఈ జిల్లాలో బలపడేందుకు వలసలను ప్రోత్సహించింది.
undefined
త్వరలోనే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కర్నూల్ జిల్లాలో వైసీపీని దెబ్బతీసేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ టీడీపీతొ పొత్తు ఉండదని తేల్చడంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సమావేశం నుండి వాకౌట్ చేశారు.
undefined
ఈ పరిణామాలను టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకొంది.టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. సోమవారం రాత్రి కోట్ల ఫ్యామిలీ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయింది.
undefined
కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరితే కర్నూల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు మెజారిటీ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన వర్గంతో పాటు టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఇవాళ, రేపు కార్యకర్తలతో సూర్యప్రకాష్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు.
undefined
click me!