26 జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వ జీవో వెనుక కారణమిదేనా....?

By narsimha lodeFirst Published Aug 9, 2020, 2:06 PM IST
Highlights

రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలుత 12 జిల్లాలను ఏర్పాటు చేయాలని సర్కార్ భావించింది. అయితే ఆయా జిల్లాల్లో వస్తోన్న డిమాండ్స్ నేపథ్యంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అభిప్రాయంతో ఉంది


అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలుత 12 జిల్లాలను ఏర్పాటు చేయాలని సర్కార్ భావించింది. అయితే ఆయా జిల్లాల్లో వస్తోన్న డిమాండ్స్ నేపథ్యంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అభిప్రాయంతో ఉంది.

దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేసేందుకు జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది. ప్రస్తుతం ఉన్న జిల్లాలతో పాటు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎస్ నీలం సహానీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేయనుంది.

also read:ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నేతృత్వంలో కమిటీ

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ  ఈ కమిటి అధ్యయనం చేయనుంది..అరకు పార్లమెంట్ నియోజకవర్గం పలు జిల్లాల్లో విస్తరించింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని  రెండు జిల్లాలుగా విభజిస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడ గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించారు.

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే పలువురు ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. దీంతో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుకు  కమిటీ అధ్యయనం చేయనుంది. 

అరకు ఎంపీ సెగ్మెంట్ ను దృష్టిలో ఉంచుకొని 25 జిల్లాలకు బదులుగా 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెండు రోజుల క్రితం జారీ చేసిన జీవోను సవరిస్తూ మార్పులు చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే ఆలోచన ఉందని సీఎం ప్రకటించారు.

కొత్త జిల్లాల విషయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీలు కూడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాయి.  మదనపల్లిని కూడ జిల్లా చేయాలనే డిమాండ్ నెలకొంది.

 మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడ కొత్త జిల్లాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి శూన్యంగా మారనుందని ఆయన వ్యాఖ్యానించారు.

జిల్లాలో అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం ప్రాంతాలు కొత్త జిల్లాల విభజనలో భాగంగా విజయనగరం జిల్లాలో కలసిపోతాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అదే జరిగితే జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవద్దని కోరారు. అదే జరిగితే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం దొరుకుతోందన్నారు.  ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.

ప్రజల మనోభావాలు సున్నితమైనవి... అవి దెబ్బతినకుండా ప్రజల అభిప్రాయాల మేరకు జిల్లాల పునర్విభజన జరుగుతోందని  ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. వీటిపై మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. 

1) అరకు జిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతాలు
130. కురుపాం 
131. పార్వతీపురం
132. సాలూరు
146. మాడుగుల,
147. అరకు లోయ 
148. పాడేరు
172. రంపచోడవరం 

2) శ్రీకాకుళం జిల్లా
120. ఇచ్ఛాపురం,
121. పలాస,
122. టెక్కలి,
123. పాతపట్నం,
124. శ్రీకాకుళం,
125. ఆముదాలవలస
127. నరసన్నపేట.

3) విజయనగరం జిల్లా
126. ఎచ్చెర్ల,
128. రాజాం 
129. పాలకొండ హ
133. బొబ్బిలి,
134. చీపురుపల్లి,
136. భోగాపురం
137. విజయనగరం.

4) విశాఖపట్నం జిల్లా
135. గజపతినగరం,
138. శృంగవరపుకోట,
139. భీమిలి,
140.తూర్పు విశాఖపట్నం,
141. దక్షిణ విశాఖపట్నం,
142. ఉత్తర విశాఖపట్నం,
143. పశ్చిమ విశాఖపట్నం

5) అనకాపల్లి  జిల్లా
144. గాజువాక,
145. చోడవరం,
149. అనకాపల్లి,
150. పెందుర్తి,
151. ఎలమంచిలి,
152. పయకరావుపేట
153. నర్సీపట్నం.

6) కాకినాడ జిల్లా
154. తుని,
155. ప్రత్తిపాడు,
156. పిఠాపురం,
157. కాకినాడ గ్రామీణ,
158. పెద్దాపురం,
160. కాకినాడ సిటీ,
171. జగ్గంపేట.

7) అమలాపురం జిల్లా 
161. రామచంద్రాపురం,
162. ముమ్మడివరం,
163. అమలాపురం
164. రాజోలు
165. గన్నవరం
166. కొత్తపేట,
167. మండపేట

8) రాజమండ్రి జిల్లా
159. అనపర్తి,
168. రాజానగరం,
169. రాజమండ్రి సిటీ,
170. రాజమండ్రి గ్రామీణ,
173. కొవ్వూరు
174. నిడదవోలు,
185. గోపాలపురం 

9) నరసాపురం జిల్లా
175. ఆచంట,
176. పాలకొల్లు,
177. నర్సాపురం,
178. భీమవరం,
179. ఉండి,
180. తణుకు,
181. తాడేపల్లిగూడెం.

10) ఏలూరు జిల్లా
182. ఉంగుటూరు,
183. దెందులూరు,
184. ఏలూరు,
186. పోలవరం 
187. చింతలపూడి
189. నూజివీడు
192. కైకలూరు

11) మచిలీపట్టణం జిల్లా
190. గన్నవరం,
191. గుడివాడ,
193. పెడన,
194. మచిలీపట్నం,
195. అవనిగడ్డ,
196. ఉయ్యూరు,
197. పెనమలూరు

12) విజయవాడ జిల్లా
188. తిరువూరు
198. భవానీపురం,
199. సత్యనారాయణ పురం,
200. విజయవాడ పడమట,
201. మైలవరం,
202. నందిగామ
203. జగ్గయ్యపేట

13) గుంటూరు జిల్లా
205. తాడికొండ
206. మంగళగిరి,
207. పొన్నూరు,
210. తెనాలి,
212. ప్రత్తిపాడు
213. గుంటూరు ఉత్తర,
214. గుంటూరు దక్షిణ

14 నరసారావుపేట జిల్లా
204. పెదకూరపాడు,
215. చిలకలూరిపేట,
216. నరసారావుపేట,
217. సత్తెనపల్లి,
218. వినుకొండ,
219. గురజాల,
220. మాచెర్ల

15 బాపట్ల జిల్లా
208. వేమూరు 
209. రేపల్లె,
211. బాపట్ల,
223. పరుచూరు,
224. అద్దంకి
225. చీరాల,
226. సంతనూతల (ఎస్.సి.)

16) ఒంగోలు జిల్లా
221. ఎర్రగొండపాలెం,
222. దర్శి,
227. ఒంగోలు,
229. కొండపి
230. మార్కాపురం,
231. గిద్దలూరు,
232. కనిగిరి

17) నంద్యాల జిల్లా
253. ఆళ్ళగడ్డ,
254. శ్రీశైలం,
255. నందికొట్కూరు
257. కల్లూరు,
258. నంద్యాల,
259. బనగానపల్లి,
260. డోన్

18 కర్నూలు జిల్లా
256. కర్నూలు,
261. పత్తికొండ,
262. కోడుమూరు
263. యెమ్మిగనూరు,
264. కౌతలం,
265. ఆదోని,
266. ఆలూరు

19) అనంతపురం జిల్లా
267. రాయదుర్గం,
268. ఉరవకొండ,
269. గుంతకల్లు,
270. తాడిపత్రి,
272. అనంతపురం,
273. కళ్యాణదుర్గం,
274. రాప్తాడు

20) హిందూపూర్ జిల్లా
 271. సింగనమల
275. మడకసిర
276. హిందూపురం,
277. పెనుకొండ,
278. పుట్టపర్తి,
279. ధర్మవరం,
280. కదిరి

21) కడప జిల్లా
243. బద్వేల్
245. కడప,
248. పులివెందుల,
249. కమలాపురం,
250. జమ్మలమడుగు,
251. ప్రొద్దుటూరు,
252. మైదుకూరు

22) నెల్లూరు జిల్లా
228. కందుకూరు,
233. కావలి,
234. ఆత్మకూరు,
235. కొవ్వూరు,
236. నెల్లూరు పట్టణ,
237. నెల్లూరు గ్రామీణ
242. ఉదయగిరి.
23) తిరుపతి 
238 సర్వేపల్లి,
 239. గూడూరు
240. సూళ్ళూరుపేట
241. వెంకటగిరి

286. తిరుపతి జిల్లా
287. శ్రీకాళహస్తి,
288. సత్యవేడు
24) రాజంపేట 
244. రాజంపేట
246 కోడూరు
247. రాయచోటి
281. తంబళ్ళపల్లె
282. పీలేరు
283. మదనపల్లె
284. పుంగనూరు

25. చిత్తూరు జిల్లా
285. చంద్రగిరి
289. నగరి,
290 గంగాధరనెల్లూరు
291 చిత్తూరు,
292 పూతలపట్టు
293 పలమనేరు,
294 కుప్పం.

click me!