
ఒక ముఖ్యమంత్రి తను తీసుకువచ్చిన జివొ ( గవర్నెమెంట్ అర్డర్) తానే ఉల్లంఘిస్తే...
అది కూడా పాత, మూలన పడిన జివొ కాదు. సరిగ్గ ఆరు నెలల కిందట తీసుకువచ్చిన జివొ యే.తన కిష్టమయిన వారికోసమో, లేక పలుకుబడి ఉన్నవారికోసమో ఒక ముఖ్యమంత్రి జివొలోని నియమాలను సడలిస్తే... ఏమనాలి.
ఏ మనాలో మీరే నిర్ణయించుకోండి. ఇది జరిగింది, ఆంధ్రలో. తానిచ్చిన జివొని తానే ఉల్లంఘించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
జూలై 21 వ తేదీన రెవిన్యూ డిపార్ట్ మెంటు విడుదల చేసిన జివొ నుఖాతరు చేయకుండా విశాఖ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి కార్యాలయం కట్టుకోవడానికి నాలుగువందల చదరపు గజాల స్థలం కేటాయించారు. ఆంధ్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
Category (3): If the strength is below 25% in Lower House but there is atleast one Member in either of the Houses, they shall be eligible upto 300 Sq. Yards of land. అని జివొొ పేజి 2 (G.O.Ms.No.340 Dated 21-07-2016. REVENUE (ASSN.I) DEPARTMENT)లో పేర్కొన్నారు.
బిజెపికి స్థలం కేటాయించడం కాదు సమస్య. రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాలలో, రాజధాని అమరావతిలో కార్యాలయాలు కట్టుకునేందుకు ఎంత భూమి ఇవ్వాలనే దానిని ఖరారు చేసి జివొ విడుదల చేశారు. అలా జివొ విడుదల చేయడం ఎందుకు, ఉల్లంఘించడం ఎందుకు అనేదే ప్రశ్న.
ఆ జివొ ప్రకారం అసెంబ్లీలో ఏదేనిపార్టీకి 25 శాతం కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉంటే , ఆపార్టీకి జిల్లాకేంద్రంలో వచ్చే భూమి కేవలం 30 గజాలు. ఇపుడు విశాఖ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చంది 4000 గజాలు.
ఈభూమి ఇచ్చేది లీజుకే అయినా అది మొదట 33 సంవత్సరాలకు, తర్వాత 99 సంవత్సాలకు పొడిగిస్తారు. ఇది వేరే విషయం.
జివొలను అనుకూలాన్ని వ్యతిరేకంగా ప్రయోగింవచ్చు, లాభం చేకూర్చాలనుకుంటే సడలించవచ్చు... ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పదల్చుకున్నది. ఈ జివో ప్రకారం అమరావతి లో ప్రతిపక్ష వైసిపికి అర్హత కేవలం అర ఎకరం. తెలుగుదశం పార్టీకి నాలుగు ఎకరాలు.