చంద్రబాబు సాధించిందేమిటి?

First Published Apr 4, 2018, 7:39 AM IST
Highlights
పార్లమెంటు సమావేశాలు మొదలైనపుడు కనీసం అటువైపు కూడా తొంగి చూడని చంద్రబాబు సమావేశాలు ముగింపు దశలో మాత్రం హడావుడిగా ఢిల్లీలో మకాం వేశారు.

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబునాయుడు ఏం సాధించారు? ఇపుడిదే ప్రశ్న రాష్ట్రంలో అందరినీ తొలిచేస్తోంది. పార్లమెంటు సమావేశాలు మొదలైనపుడు కనీసం అటువైపు కూడా తొంగి చూడని చంద్రబాబు సమావేశాలు ముగింపు దశలో మాత్రం హడావుడిగా ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీకి వెళ్ళి ఏమి సాధించారో మరి చంద్రబాబే చెప్పాలి.

అందరికీ కనబడిందేమిటంటే, బిజెపికి వ్యతిరేకంగా ఉండే జాతీయ పార్టీల నేతలను పార్లమెంటు సెంట్రల్ హాలులో కలిసారు. ఏపికి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించారట. ప్రత్యేకహోదాకు మద్దతు అడుగుతూనే విభజన చట్టాన్ని అమలు చేయించటంలో కేంద్రంపై ఒత్తిడి తేవటంలో సహకరించాలని కోరారట. విచిత్రంగా లేదు చంద్రబాబు విజ్ఞప్తులు.

ఏపికి కేంద్రం సాయం చేయకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నపార్టీలు ఏం చేస్తాయి? ఎందుకంటే, పార్లమెంటు సమావేశాలు బుధవారం ఆఖరని ప్రచారం జరుగుతోంది. అది నిజమే అయితే మళ్ళీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. అప్పటికి రాజెవరో రెడ్డెవరో ఎవరూ చెప్పలేరు. దాదాపు నాలుగేళ్ళు ఎన్డీఏతో అంటకాగిన చంద్రబాబు చివరి నిముషంలో బయటకు వచ్చినంత మాత్రానా మిగిలిన పార్టీలు నమ్ముతాయా? మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీలో సాధించిందేమిటంటే గుండుసున్నా అనే చెప్పాలి.

click me!