వైయస్ జగన్ కి క్లాస్ మేట్స్ అరుదైన గిఫ్ట్: చంద్రబాబు కోసమేనా....

By Nagaraju penumalaFirst Published May 26, 2019, 7:48 AM IST
Highlights

ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ఎక్కడ చదివారో తెలియదు. ఏం చదివారో తెలియదు. ఎక్కడ చదువుకున్నాడో కూడా చెప్పలేని స్థితిలో జగన్, ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు ఆయన క్లాస్ మేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రికి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీ వేయించారు. 

జగన్ మేము చాలా గర్వపడుతున్నాం అంటూ ఫ్లెక్సీపై ముద్రించారు. 1991లో హైదరాబాద్  పబ్లిక్ స్కూల్ లో వైయస్ జగన్ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మిత్రులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియాలో మెట్రో పిల్లర్స్ వద్ద డిజిటల్ బోర్డులలో ప్రత్యేకంగా స్వాగత శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిన అనంతరం తొలిసారిగా వైయస్ జగన్ హైదరాబాద్  చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటకు ఆహ్వానించాలని కోరుతూ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన డిక్ల రేషన్ ను గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. 

ప్రమాణ స్వీకారానికి కుటుంబ సమేతంగా రావాలంటూ గవర్నర్ నరసింహన్ దంపతులను వైయస్ జగన్ దంపతులు కోరారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని సైతం జగన్ దంపతులు కలిశారు. 

ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని కోరారు. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి బయలుదేరారు వైయస్ జగన్. అక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ఎక్కడ చదివారో తెలియదు. ఏం చదివారో తెలియదు. ఎక్కడ చదువుకున్నాడో కూడా చెప్పలేని స్థితిలో జగన్, ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

వైయస్ జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివారని తెలియజేసేందుకే ఆయన మిత్రులు ఇలా చేశారా అన్న సందేహం కూడా నెలకొంది. ఏదిఏమైనప్పటికీ జగన్ క్లాస్ మేట్స్ ఇచ్చిన అరుదైన గౌరవం జగన్ ఎక్కడ చదివారు అన్నది మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. 

click me!