సతీసమేతంగా రాజభవన్ కు జగన్: ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

By Nagaraju penumalaFirst Published 25, May 2019, 6:40 PM IST
Highlights

అనంతరం వైయస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతిలు జగన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో మధ్యాహ్నాం 12.23 నిమిషాలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.   

హైదరాబాద్‌: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైయస్ జగన్ తెలుగు  రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. వైయస్ జగన్ తోపాటు ఆయన సతీమణి వైయస్ భారతి, వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు గవర్నర్ ను కలిశారు. 

రాజభవన్ కు చేరుకున్న వారికి గవర్నర్ నరసింహన్ దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభాపక్ష సమావేశ తీర్మానాన్ని జగన్‌ గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌ ను జగన్‌ కోరారు. 

అనంతరం వైయస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతిలు జగన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో మధ్యాహ్నాం 12.23 నిమిషాలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.   

ఈ వార్తలు కూడా చదవండి

గవర్నర్ తో భేటీ: ప్రభుత్వ ఏర్పాటుకు జగన్ కు ఆహ్వానం

Last Updated 25, May 2019, 6:45 PM IST