వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ మర్డర్.. హంతకులు దొంగలా?

Published : Mar 04, 2024, 04:07 AM IST
వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ మర్డర్.. హంతకులు దొంగలా?

సారాంశం

23 ఏళ్ల సాయికుమార్ అనే యువ ఫొటోగ్రాఫర్ ఏపీలో హత్యకు గురయ్యాడు. వెడ్డింగ్‌ ఈవెంట్ కవర్ చేయడానికి బయల్దేరి వెళ్లిన ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. సాయికుమార్ తన వెంటే రూ. 15 లక్షల విలువైన ఫొటోగ్రఫీ పరికరాలను వెంట తీసుకెళ్లాడు.  

ఓ యువ ఫొటోగ్రాఫర్ దారుణ హత్యకు గురయ్యాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమా జిల్లాలోని రావులపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం, పోతిన సాయికుమార్ (23) వెడ్డింగ్స్ కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్స్ తీసుకునేవాడు. రావులపాలెం నుంచి ఫిబ్రవరి 26వ తేదీన సాయి కుమార్‌కు అపాయింట్‌మెంట్ వచ్చింది. ఈ విషయం గురించి సాయికుమార్ తల్లిదండ్రులకు చెప్పాడు. 

సాయికుమార్ రాజమండ్రి చేరగానే ఇద్దరు దుండగులు సాయికుమార్‌ను కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే.. సాయికు మార్ నుంచి ఫోన్లు రాకపోవడంతో తల్లిదండ్రులు గాబరా పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకు కనిపించకుండా పోయాడని పాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.

పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టి.. కాల్ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించారు. ఈ దర్యాప్తులో లభించిన ఆధారాలతో పోలీసులు శణ్ముఖ తేజ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Also Read : ప్రజ్ఞా ఠాకూర్‌కు టికెట్ నిరాకరణ.. ‘ మోడీ నన్ను క్షమించలేదు ’

సాయికుమార్ హత్యకు గల కారణం చోరీ అని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. సాయికుమార్ హై ఎండ్ ఫొటోగ్రఫీ ఎక్విప్‌మెంట్‌ను తీసుకెళ్లుతున్నాడు. ఆ ఎక్విప్‌మెంట్ ధర సుమారు రూ. 15 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఎక్విప్‌మెంట్‌ను కాజేయాలనే ఆశతో ఆ దుండగులు దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Jogi Ramesh vs Police: పారిపోతున్న జోగి రమేష్ వేటాడి పట్టుకున్న పోలీసులు| Asianet News Telugu
నువ్వు నీతులు చెప్పకు అక్క : Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet Telugu