భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ నకిలీ కోవిడ్ రిపోర్టు.. వాట్సాప్ పట్టించింది..!

By telugu news teamFirst Published Jul 10, 2021, 9:25 AM IST
Highlights

కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్ బోయినపల్లి ఇన్ స్పెక్టర్ రవికుమార్ కు గత శనివారం కరోనా పాజిటివ్ రిపోర్టును వాట్సాప్ లో పంపించాడు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ మరోసారి పోలీసులకు చిక్కారు. హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను అపహరించిన కేసులో భార్గవ్ రామ్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. పోలీసులకు కరోనా నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించాడని అతనిపై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో రెండో కేసు నమోదైంది.

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. తొలుత నిజమేనని నమ్మిన అధికారులు.. అనంతరం విచారణణ చేపట్టి సాక్యాధికారాలు సేకరించారు. ఉత్తుత్తి పాజిటివ్ రిపోర్టుగా తేల్చారు. ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిన గాయత్రి ల్యాబ్ లైసెన్స్ రద్దు చేయాలంటూ వైద్యారోగ్యశాఖకు లేఖ రాశారు.

కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్ బోయినపల్లి ఇన్ స్పెక్టర్ రవికుమార్ కు గత శనివారం కరోనా పాజిటివ్ రిపోర్టును వాట్సాప్ లో పంపించాడు. న్యాయస్థానంలో ఈ విషయాన్ని వివరించేందుకు ఇన్ స్పెక్టర్ సిద్దమయ్యారు. ఆ వాట్సాప్ మెసేజ్ ను ఉన్నతాధికారులకు పంపించారు.

ఆ రిపోర్టు చూసిన అధికారులకు అక్షరాలు మార్చినట్లు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు ల్యాబ్ అధికారులకు ప్రశ్నించగా.. అసలు నిజం బయటపడింది.

పది రోజుల క్రితమే పథకం వేసి మరీ.. భార్గవ్ రామ్ ఇలా చేసినట్లు తెలిసింది. తన స్నేహితుడి సహాయంతో.. డబ్బులు ఇచ్చి.. ఇలా ఫేక్ రిపోర్టు తయారు చేసినట్లు గుర్తించారు. కాగా.. భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉండగా.. ఆయన కోసం గాలిస్తున్నారు. 

click me!