వెనక్కి వెళ్లం: చంద్రబాబుతో పొత్తుపై అమిత్ షా

First Published Jul 29, 2018, 10:21 AM IST
Highlights

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు మళ్లీ తెలుగుదేశం పార్టీని సంప్రదించబోమని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాన్ని స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు మళ్లీ తెలుగుదేశం పార్టీని సంప్రదించబోమని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాన్ని స్పష్టం చేశారు. 

టీడీపితో తిరిగి పొత్తు పెట్టుకుంటారా అడిగితే "వాళ్లే మాతో తెగదెంపులు చేసుకున్నారు. వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు" అని అమిత్ షా జవాబిచ్చారు. కొత్త పొత్తులపై ప్రస్తావన వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ వెనక్కి వెళ్తామని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. పిడీపితో పొత్తు పెట్టుకుని తాము తప్పు చేశామని చెప్పారు. 

మిత్ర పక్షాలను, భాగస్వామ్య పక్షాలను బీజేపీ చిన్న చూపు చూస్తోందని, స్నేహధర్మం పాటించడం లేదనే  ఆరోపణలను ఆయన తిరస్కరించారు. శివసేన ఇప్పటికీ తమ భాగస్వామ్య పక్షమని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. 

వారు తమతోో కొనసాగుతున్నపుడు వారంటున్న మాటలను పట్టించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆయన అడిగారు.2019లో కొత్త పార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పారు.

click me!