పవన్ పర్యటనను అడ్డుకోం, అరెస్ట్ కూడా చేయం... పోలీసుల క్లారిటీ

By telugu team  |  First Published Jan 14, 2020, 2:14 PM IST

ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడిన తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్.. మంగళవారం కాకినాడకు వస్తున్నారు. 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనను తాము అడ్డుకోబోమని.... అలా అని పవన్ ని అరెస్ట్ కూడా చేయమని ఎస్పీ నయీం హస్మీ స్పష్టం చేశారు. పవన్ పర్యటన ప్రశాంతంగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఎస్పీ కోరారు.

ఆదివారం జరిగిన ఘటనపై వీడియో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ నయీం హస్పీ చెప్పారు. కాగా.. రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్.. నేడు కాకినాడ పర్యటనకు వస్తున్న  సంగతి తెలిసిందే. పవన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి... జనసేన అధినేతను కించపరిచేలా మాట్లాడారు.

Latest Videos

Also Read జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా...

ఆయన మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నివాసం వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడిన తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్.. మంగళవారం కాకినాడకు వస్తున్నారు. 

పవన్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో కాకినాడలో 144 సెక్షన్, 30  యాక్ట్ అమలు  చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలను ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

click me!