బలహీనవర్గాల శకం ప్రారంభమైంది: మంత్రులు వేణుగోపాల్, అప్పలరాజు

By narsimha lodeFirst Published Jul 22, 2020, 2:44 PM IST
Highlights

బలహీనవర్గాల శకం ప్రారంభమైందని ఏపీ మంత్రి వేణుగోపాల్ చెప్పారు. తాను పాలకుడిని కాదు, ప్రజలకు సేవకుడినని ఆయన ప్రకటించారు.


అమరావతి:బలహీనవర్గాల శకం ప్రారంభమైందని ఏపీ మంత్రి వేణుగోపాల్ చెప్పారు. తాను పాలకుడిని కాదు, ప్రజలకు సేవకుడినని ఆయన ప్రకటించారు.

మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత అప్పలరాజు, వేణుగోపాల్ బుధవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 
బీసీ వర్గాలు వెనుకబడి ఉండడానికి వీల్లేదు.. వారంతా ఉన్నత స్థానాలను అధిరోహించాలని సీఎం జగన్ మంచి ఆశయంతో పనిచేస్తున్నారని మంత్రిగా ప్రమాణం చేసిన వేణుగోపాల్ ప్రకటించారు.

also read:జగన్‌ కేబినెట్లోకి ఇద్దరు: వేణుగోపాల్, అప్పలరాజుతో గవర్నర్ ప్రమాణం

తూర్పుగోదావరి జిల్లా నుండి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఎంపీ పదవి ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇవ్వడం బీసీలపై జగన్ కు ఉన్న ప్రేమకు నిదర్శంగా చెప్పారు.తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా తనకు వైఎస్ఆర్ రాజకీయంగా జన్మనిచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల అప్పలరాజు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై ముఖ్యమంత్రి పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ముచేయబోనన్నారు.ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు.
 

click me!