సినీ పరిశ్రమకు గుదిబండ: పవన్ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్

By narsimha lode  |  First Published Sep 28, 2021, 1:06 PM IST

ఆన్ లైన్ టికెట్ విధానం పట్ల మెజారిటీ వర్గాలు సంతోషంగా ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు గుదిబండగా మారాడని ఆయన విమర్శించారు. వ్యక్తిగత స్వార్ధం కోసం  పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. 


అమరావతి:ఆన్‌లైన్ టికెట్ల విధానంపై (online ticket )డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగానే (cine distributors) ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) చెప్పారు.తన స్వార్ధం కోసమే ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

also read:వైసీపీ విమర్శలకు పవన్ కౌంటర్: జగన్ పార్టీపై జనసేనాని సెటైర్లు

Latest Videos

undefined

మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమకు ప్రయోజనం కల్గించేలా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోందని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలోనే కొందరు స్పందిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గుదిబండగా మారారని ఆ పరిశ్రమకు చెందిన వారే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

రూ. 100 టికెట్ ను రూ. 1000 లేదా రూ. 2000లకు అమ్ముకోవాలని అనుకొనేవాళ్లకి నచ్చడం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవకతవకలు లేకుండా అందరికీ న్యాయం చేసేందుకే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు.

ప్రేకక్షకులకు, సినీ పరిశ్రమకు మధ్య బ్యాలెన్స్ చేయడం కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టడంలో అర్ధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.అందరికీ ఉపయోగపడేలా నూతన విధానాన్ని తీసుకు రావాలని చేస్తున్న ప్రయత్నాన్ని  సినీ పరిశ్రమలోని కొందరు అడ్డుకోవడం సరైంది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.గతంలో ఏ హీరో సినిమాకైనా ఒకే టికెట్ ఉండేదని ఆయన గుర్తు చేశారు.గతంలో ఏ హీరో సినిమాకైనా ఒకే టికెట్ ఉండేదని ఆయన గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు సీఎం జగన్ ను ఎప్పుడైనా కలువొచ్చన్నారు.


 

click me!