శాస్త్రీయంగానే ఏపీలో జిల్లాల పునర్విభజన చేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ చెప్పారు.
అమరావతి: జిల్లాల పునర్విభజనకు సంబంధించి నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను పూర్తిచేశామని జిల్లాల పునర్విభజన కమిటీ చైర్మన్ విజయకుమార్ తెలిపారు.
ఈ నెల 3వ తేదీ వరకు ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేసి అదే రోజు మొత్తం నివేదికను ముఖ్యమంత్రి YS Jaganకి అందిస్తామని విజయ్ కుమార్ చెప్పారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరితో కలిపి నాలుగు జిల్లాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను Vijay kumar సోమవారం నాడు విశాఖ పట్టణంలో పరిశీలించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్ధ్ జైన్‌తో కలిసి వాటిని స్క్రూటినీ చేశారు.
undefined
ఈ సందర్భంగా విజయకుమార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాల విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతుందన్నారు. ప్రతీ జిల్లాలో సగటున 18 నుంచి 20 లక్షల జనాభా ఉంటుందన్నారు. దీంతో పరిపాలన సౌలభ్యం కలగడంతోపాటు మారుమూల గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలపై చర్చించామని ఆయన చెప్పారు. వీటి నుంచి మొత్తం 4,590 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే 4,000 వచ్చాయన్నారు.
Vizianagarm నుండి 40, Visakhapatnam నుండి 250, East Godavariజిల్లా నుంచి 300 అభ్యంతరాలు వచ్చాయని విజయకుమార్ వివరించారు.తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాకుండా రాజమండ్రి జిల్లాలోనే చేర్చాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు. అమలాపురం జిల్లాలో ఉండే మండపేట, జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలాన్ని Rajahmundryలోనే కొనసాగించాలని ప్రజల నుండి వినతులు వచ్చాయని విజయ్ కుమార్ చెప్పారు. విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలనే డిమాండ్ కూడా ఉందన్నారు. పార్వతీపురం పేరును జిల్లాగా ఉంచాలని ప్రజల నుండి వినతులు వచ్చాయన్నారు. పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలనే డిమాండ్ కూడా ఉందన్నారు. అనకాపల్లి జిల్లాకు నర్సీపట్నం కేంద్రం చేయాలనే డిమాండ్ కూడా ఉందని విజయ్ కుమార్ తెలిపారు.
కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు. కొత్త జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్ సైట్‌లో ప్రతీరోజూ అప్‌లోడ్ చేయాల్సి వుంటుంది. ఇలా అప్‌లోడ్ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి.
ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.