త్వరలోనే టీడీపీ,జనసేన ఉమ్మడి కార్యాచరణ విడుదల: పవన్ కళ్యాణ్

By narsimha lode  |  First Published Oct 23, 2023, 6:47 PM IST

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం  ఇవాళ రాజమండ్రిలో జరిగింది.ఈ సమావేశంలో  ఆరు అంశాలపై  కీలకంగా చర్చించారు.


రాజమండ్రి: త్వరలోనే  టీడీపీ, జనసేన కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.సోమవారంనాడు  టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం  జరిగింది. సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ పాలనలో  అన్ని వర్గాల ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.అన్ని పార్టీల నేతలనూ జగన్ ప్రభుత్వం  ఇబ్బంది పెడుతుందని  ఆయన  ఆరోపించారు.వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలబోనివ్వని తాను 2021లోనే ప్రకటించినట్టుగా  ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  అనుభవం ఉన్న  నాయకుడు రాష్ట్రానికి అవసరమని  2014లో  టీడీపీకి మద్దతిచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.

రాష్ట్రంలో మధ్య నిషేధం చేస్తామని  చెప్పి విచ్చలవిడిగా  అమ్ముతున్నారన్నారు. రూ. 30 వేల కోట్లను మద్యంపై జగన్ సర్కార్  సంపాదిస్తుందని ఆయన ఆరోపించారు. దారుణాలు చేసిన వారికి కూడ బెయిల్ వస్తుందన్నారు. కానీ చంద్రబాబు అరెస్టై  40 రోజులు అవుతున్నా  ఆయనకు ఇంకా బెయిల్ రాలేదన్నారు. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైలులో పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

Latest Videos

undefined

టెక్నికల్ అంశాలను  సాకుగా చూపి చంద్రబాబుకు బెయిల్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన మాటను  రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన  విమర్శించారు.టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్టుగా ఆయన చెప్పారు.ఎన్‌డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఏపీ ప్రజల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు.రాష్ట్రంలో ఉన్న చిత్రమైన పరిస్థితితో ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.అభివృద్ధఇ, సంక్షేమం జోడెద్దుల బండి అని ఆయన వ్యాఖ్యానించారు.అప్పులు చేసి కాకుండా అభివృద్దితో రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నారు. టీడీపీ, జనసేన మధ్య ఎట్టి పరిస్థితుల్లో గొడవలు రావన్నారు.

also read:ప్రారంభమైన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ:ఆరు అంశాలపై చర్చ

ఏపీ రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుందని ఆయన  విమర్శించారు. ఈ తెగులు పోవాలంటే  టీడీపీ, జనసేన వ్యాక్సిన్ అవసరమన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రాజమండ్రిలో భేటీ అయ్యామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై  చర్చించినట్టుగా  పవన్ కళ్యాణ్ చెప్పారు.టీడీపీ, జనసేన ఎలా కలిసి పనిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా  ఆయన తెలిపారు.వైఎస్ జగన్ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని   జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు..

ఆంధ్రప్రదేశ్ భద్రత, సుస్థిరతపైనే చర్చించామన్నారు. ఆ తర్వాతే పదవులపై చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.
మూడు విడతలుగా తమ కార్యక్రమాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.  ఉమ్మడిగా ఎలా వెళ్లాలనే దానిపై రెండో సమావేశంలో నిర్ణయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

click me!