పది రోజుల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కు నోటీసులిస్తాం - ఏపీ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ

By team teluguFirst Published Nov 29, 2022, 10:32 AM IST
Highlights

మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో ఆర్థిక నిబంధల ఉల్లంఘన జరిగిందని ఏపీ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ అన్నారు. అందుకే దీనిపై మరో పది రోజుల్లో ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ఆయన సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. 

ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించినందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ కు పది రోజుల్లో నోటీసులు అందజేస్తామని ఏపీ రాష్ట్ర స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ అన్నారు. ఈ నోటీసులకు ఆ సంస్థ ఇచ్చే స్పందనలను బట్టి తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం ఆయన ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ లో నిధుల మళ్లింపులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. చిట్స్ డబ్బును దాని కోసమే ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అలా జరగలేదని తెలుస్తోందని చెప్పారు. అందుకే తాము స్పెషల్ ఆడిటింగ్ రెడీ అవుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న మార్గదర్శి హెడ్ ఆఫీసులోనూ తనిఖీలు చేపడుతామని అన్నారు. దాని కోసం తెలంగాణ అధికారుల సహాయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

తాతతో కలిసి డ్యూయెట్ పాడిన రెండు నెలల చిన్నారి...

అయితే ఈ విషయంలో కష్టమర్ల నుంచి ప్రత్యేకంగా కంప్లైంట్స్ రాలేదని ఐజీ రామకృష్ణ అన్నారు. కానీ మార్గదర్శి ఖాతాల మెయిటెంటెన్స్ సరిగా లేదని సమాచారం అందటంతో ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కాగా.. అక్టోబరు 21వ తేదీన ఏపీ వ్యాప్తంగా 12 చిట్‌ ఫండ్‌ సంస్థల్లో తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. గత నెల 31వ తేదీన 5 కంపెనీలపైన, ఈ నెల మధ్యలో మార్గదర్శి చిట్స్ ఫండ్స్ కు చెందిన 18 బ్రాంచ్స్ లో తనిఖీలు నిర్వహించామని ఐజీ తెలిపారు. కాగా ఇందులో సమస్యలు ఎదురు అవుతున్నాయని ఆయన అన్నారు. 

ఆ సంస్థలోని ఫోర్ మెన్ కు ఎలాంటి వివరాలు తెలియని ఐజీ రామకృష్ణ తెలిపారు. తాము ఏ విషయంపై ప్రశ్నించినా.. వివరాలు హెడ్ ఆఫీసులో ఉంటాయని సమాధానం వస్తోందని అన్నారు. పత్రాలు స్వాధీనం చేసుకునే అంశంపై సంతకం కూడా పెట్టలేదని అన్నారు. ప్రజల నుంచి సెక్యూరిటీ కోసమని తీసుకున్న నిధులు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని పేర్కొన్నారు. ఇది ప్రజలను మోసం చేయడమే అవుతుందని చెప్పారు. ప్రతీ దానికి రికార్డులు, మినిట్స్ మెయింటెన్ చేయాలని, కానీ మార్గదర్శిలో ఇలాంటి జరగలేదని చెప్పారు. 

ఏపీలో పడిపోతున్న‌ ఉష్ణోగ్ర‌త‌లు.. ఏజెన్సీ ప్రాంతాల్లో పెరుగుతున్న చ‌లి.. !

ఈ సంస్థల్లో జరిగే ప్రతీ చిట్ సమాచారం అంతా స్టాంపులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కు తెలియాల్సి ఉంటుందని, కానీ వాటిని తమకు అందజేయలేదని, దీని వల్ల ఇక్కడ నిధులు పక్క దారి మళ్లాయని తాము అనుకోవాల్సి వస్తోందని ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన వివరాలు, బిజినెస్ వివరాలు, టిట్స్ కు సంబంధించిన వివరాలు, ఇన్వెస్టిమెంట్స్ వివరాలు తమకు ఇవ్వలేదని ఆయన అన్నారు. మార్గదర్శి బ్రాంచ్ లేవీ తమ ఎంక్వేరీకి సహకరించడం లేదని అన్నారు. అందుకే ఆ కంపెనీపై తమకు అనుమానం వస్తోందని అన్నారు. 

మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టించడం ఆపండి: మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ప్రజల నుంచి చిట్స్ రూపంలో సేకరించిన డబ్బును ఉషోదయ, ఉషాకిరణ్‌ మూవీస్‌ వంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా అర్థమవుతోందని ఐజీ రామకృష్ణ అన్నారు. ప్రజల సొమ్మును వేరే పనుల నిమిత్తం వినియోగిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఆ సంస్థల్లో చట్ట ప్రకారం రికార్డులు మెయిటెంన్ చేయడం లేదని తెలిపారు. అందుకే ఈ విషయంలో నోటీసులు జారీ చేస్తామని, దాని నుంచి స్పందన వచ్చిన తరువాత తాము అసవరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. 
 

click me!